“ఎవరు ఏమనుకున్న.. రాహుల్-రతికల మధ్య ఉన్నది అదే”.. సంచలన విషయాన్ని బయటపెట్టిన రతిక పేరంట్స్..!!

రతిక .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే మారుమ్రోగిపోతుంది. స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో ఆమె గురించి చర్చించుకుంటున్నారు జనాలు . దానంతటకీ కారణం ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి మళ్లీ హౌస్ లోకి రావడం .. మళ్ళీ ఆమె తన డబల్ గేమ్స్ స్టార్ట్ చేయడమే . రతిక అంటే అంతకు ముందు ఎవ్వరికీ తెలిసేది కాదు . బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయ్యాకే ఆమె పేరు జనాలలో బాగా వినిపిస్తుంది .

అయితే హౌస్ లో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగజ్ పై పరోక్షంగా చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి . రతిక గతంలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ తో ప్రేమాయణం నడిపింది అని .. వాళ్ళు క్లోజ్ గా దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . ఆయన పేరు చెప్పుకొని కూడా కొన్నాళ్లు హౌస్ లో నెట్టుకొచ్చింది అన్న కామెంట్స్ ఇప్పటికీ కూడా మనకు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి .

అయితే రతిక-రాహుల్ ప్రేమ పై పేరంట్స్ స్పందించారు. రతిక తండ్రి రాములు తల్లి అనిత రతిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” రతిక చాలా మంచిది అని.. అందరిని మన వాళ్లే అనుకుంటుందని.. కొందరు మాత్రం ఆమెను చీట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇంటర్ సెకండియర్ లో ఉన్నప్పుడు విజయనిర్మల తీసిన ఈ జన్మ నీకే అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రతికకు ఆఫర్ వచ్చిందట . మంచ్గి ఛాన్స్ పైగా మహేష్ తల్లి సినిమా అని తెలిసి షూటింగ్ కి వెళ్ళిందట . కానీ కొన్ని కారణాల చేత సినిమా ఆగిపోయింది”.

“అప్పుడే రతికకు రాహుల్ తో పరిచయం ఏర్పడి.. రెండు మూడు పాటలు ఆమెతో చేశాడు. అలా వాళ్ల మధ్య ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయిపోయింది . ఆ అబ్బాయ్ మా చిన్న అమ్మాయి పెళ్లికి కూడా వచ్చాడు. అయితే నేనే ఓ రోజు రాహుల్ ఇంటికి వెళ్ళి ..మా అమ్మాయికి పెళ్లి కావాలి నాయన..నువ్వు ఇలాంటి పాటలు తీస్తే మా అమ్మాయిని ఎవ్వరు చేసుకుంటారు అంటూ గట్టిగా మాట్లాడమని చెప్పుకొచ్చాడు”. అంతేకాదు రతిక – రాహుల్ మధ్య అలాంటిది ఏదీ లేదని.. రతిక అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటుందని.. హౌస్ లోపల పల్లవి ప్రశాంతతో కూడా అదే విధంగా ఫ్రెండ్ లాగే మాట్లాడుతుందని కానీ బయట వాళ్ళు ఆమెను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని..మాట్లాడుకుంటున్నారని అది మాకు చాలా బాధగా ఉంది” అంటూ ఫీల్ అయిపోయాడు..!!