పేకాట ఆడుతున్న ప్రిన్స్ మహేష్, వెంకటేష్.. ఫొటోలు వైరల్…

ప్రముఖ టాలీవుడ్ స్టాప్ హీరోలు నటులు మహేష్ బాబు, వెంకటేష్ ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పేకాట ఆడుతూ కనిపించారు. వీరిద్దరూ పేకాట ఆడుతూ సరదాగా గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేష్ బాబు ఆరంజ్ కలర్ చొక్కా ధరించి హ్యాండ్సమ్ గా కనిపించగా, వెంకటేష్ నల్ల చొక్కా, సన్ గ్లాసెస్ ధరించి కనిపించాడు. గేమ్ ఆడుతున్నప్పుడు ఇద్దరూ రిలాక్స్‌గా, హ్యాపీగా నవ్వుతూ కనిపించారు. ఒక క్లబ్ హౌస్ ఓపెనింగ్‌కు ఈ హీరోలు చీఫ్ గెస్ట్‌లుగా వెళ్లినట్లు సమాచారం. అప్పుడే ఈ ఆట ఆడినట్లు తెలుస్తోంది.

ప్రిన్స్ మహేష్, వెంకీ ఫ్యామిలీ డ్రామా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో అన్నదమ్ములుగా కలిసి నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ బ్రదర్స్‌గా వెండితెరపై చాలా చక్కగా కనిపించే కట్టుకున్నారు. వారి బ్రొమాన్స్ చాలామందికి బాగా నచ్చేసింది. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి కనిపించడం చూసే చాలామంది అభిమానులు ఫిదా అవుతున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మహేష్ బాబు, వెంకటేష్ ఇద్దరూ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారు. యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన రాబోయే చిత్రం గుంటూరు కారం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధా కృష్ణ నిర్మించిన గుంటూరు కారం ఒక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, రమ్యకృష్ణ, జగపతి బాబు, జయరామ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గుంటూరు కారం జనవరి 12న మహేష్ బాబు అభిమానులకు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్‌, కామెడీతో కూడిన మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.