రవితేజకు మాస్ మహారాజ్ అనే బిరుదు ఇచ్చింది ఎవరో తెలుసా.. ?

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తన సొంత కష్టంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగాడు. మొదట ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రవితేజ.. తరువాత పలు సినిమాల్లో కీలక పాత్రలో నటించాడు. తన నటనతో మెప్పించి హీరో స్థానాన్ని దక్కించుకున్న‌ రవితేజ చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే స్టార్ హీరోగా క్రేజ్ ద‌క్కించుకున్నాడు. ఎనర్జిటిక్ హీరోగా మారాడు. ఇటీవల వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమా తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
మాస్ మహారాజు రవితేజ అని ఆయ‌న‌ను అభివ‌ర్ణిస్తారు.

ఇక‌ రవితేజకు మాస్ మహారాజా అనే పేరు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారో..? ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. గతంలో రవితేజ హీరోగా, జ్యోతిక హీరోయిన్గా షాక్‌ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమా టాలీవుడ్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. తరువాత హరీష్ శంకర్ ప‌లు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ బిజీ అయ్యారు. ఇక షార్ట్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా హరీష్ శంకర్ స్టేజ్ మీదకి ప్రతి ఒక్కరిని పిలవాలి.. ఏదైనా స్పెషల్ గా ఉండాలి అని ఆలోచించి సుమతో మాట్లాడుకొని ఒక్కొక్కరిని ఒక విధంగా స్టేజి పైకి పిలిచారట.

ఇక అదే నేపథ్యంలో రవితేజను మాస్ మహారాజు రవితేజ గారు స్టేజ్ పైకి రావాలి అంటూ ఇన్వైట్ చేశాడట. అప్పుడు ఈవెంట్ లో ఉన్న రవితేజ ఫ్యాన్స్ విజిల్స్ తో, క్లాప్స‌ఖ‌తో మారు మోగిపోయింది. అదే పేరు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ శంకర్ దీనిపై మాట్లాడుతూ నాకు డైరెక్టర్ గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన హీరో రవితేజ గారికి నేను ఒక బిరుదు ఇవ్వడం అది ఇప్పటికీ కంటిన్యూ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.