ఆ ఒక్క మాటతో శివాజీ పరువును గంగలో కలిపేసిన మానస్… అంత మాట అనేసాడేంట్రా బాబు…!!

బిగ్ బాస్ 7 ప్రస్తుతం రసవత్తంగా సాగుతుంది. కంటిస్టెంట్ల మధ్య పోరు, గొడవలు ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. అలాగే వీరికి సపోర్ట్ చేసే పలు సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వారంలో గేమ్ ఆడుతుంటే.. శివాజీ మాత్రం ఒక్క గేమ్ కూడా ఆడలేదు. కూర్చుని మాటలు చెప్పడం తప్ప హౌస్ లో పని కూడా చేయడం లేదు.

ఈయనకు నీతి మాటలు చెప్పడమే కానీ.. పాటించడం అస్సలు రాదు. ఈయనకో న్యాయం.. ఇతరులకో న్యాయం అన్నట్లు చేస్తుంటాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో అమర్, శివాజీల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ప్రతిసారి చిన్నచిన్న కారణాలు చెప్పి అమర్ ని నామినేట్ చేస్తూ ఉంటాడు శివాజీ. అంతేకాకుండా శివాజీకి నచ్చిన వాళ్ళు తప్పు చేస్తే సమర్థిస్తాడు.. అదే అమర్ కానీ గౌతమ్ కానీ చిన్న మిస్టేక్ చేసినా… ఆ వారంలో నామినేషన్ లో ఉంచుతాడు.

వీటిపై స్పందించిన బిగ్ బాస్ ఫేమ్ మానస్…” ప్రతి సీజన్ లో శివాజీ లాంటి విలన్స్ ఉంటారు. కానీ హీరో ఎవరనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. శివాజీ కేవలం ఇద్దరి పట్ల మాత్రమే వ్యక్తిగత ఇష్టం చూపిస్తున్నాడు. మిగిలిన కంటెస్టెంట్లు గేమ్ చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకు నేను రకరకాల మైండ్ సెట్ ఉన్నవాళ్లను చూశాను. కానీ శివాజీ లాంటి కంటెస్టెంట్ ను నేను ఎప్పుడూ చూడలేదు ” అంటూ చెప్పుకొచ్చాడు మానస్. ప్రస్తుతం ఈయ‌న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.