అక్కినేని హీరో నాగ చైతన్య ఫిట్‌నెస్ బాగా మెయింటైన్ చేస్తుంటాడు నాగార్జున వలె చైతు కూడా మొదట సినిమాలో ఎలా కనిపించాడో ఇప్పుడు కూడా అంతే ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఈ హ్యాండ్సమ్ హీరో ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తన మొదటి పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ #NC23 కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మూవీలో ఈ నటుడు కొత్త అవతారంలో కనిపించనున్నాడు. అందుకోసమే జిమ్‌లో ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తూ మేకవర్ కోసం ప్రయత్నిస్తున్నాడు.
తాజాగా తన వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోను పంచుకున్నాడు, అందులో చాలా మజిక్యులర్‌గా కనిపించాడు. కండలు తీరిన బాడీతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ లవ్ డ్రామాలో ఆయన జాలరి పాత్రలో కనిపించనున్నారు.
ఈ మూవీలో దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతురాలైన సాయి పల్లవి నాగ చైతన్య సరసన కథానాయికగా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాసు నిర్మాతగా, లెజెండరీ బ్యానర్ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. చైతన్య, పల్లవి ఆల్రెడీ లవ్ స్టోరీ సినిమా కోసం ఒకసారి కలిశారు. వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలామందిని మెప్పించింది. త్వరలో మళ్ళీ వారు వెండితెరపై మెరవనుండగా అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు.
ఇక చైతన్య రీసెంట్ జిమ్ వర్కవుట్ చూసి అభిమానులు ఇన్‌స్పైర్ అవుతున్నారు. పంప్-అప్, పుష్ అప్స్ చేస్తూ నాగచైతన్య లాగా తయారు కావాలని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. #NC23 ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని 2024లో విడుదల చేయాలని భావిస్తున్నారు.
Yuvasamrat @chay_akkineni on Beast Mode for his next #NC23 🔥#NagaChaitanya is dropping fitness goals with massive workout sessions at the gym🥊 pic.twitter.com/XB5f6Sr4IM
— Vamsi Kaka (@vamsikaka) November 5, 2023