” నా ముందు ఇప్పుడు అదొక్కటే మార్గం “… సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టిన శ్రీజ…!!

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె ముందు ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంగతి మనకి తెలిసిందే. అనంతరం విడాకులు తీసుకుంది. మళ్లీ మెగా కుటుంబానికి దగ్గర అయింది. ఈమె గురించి ఆలోచించి చిరంజీవి ఈమెకి రెండో పెళ్లి చేశాడు. ఆ యువకుడు పేరూ కల్యాణ్ దేవ్. వీరిద్దరి కాపురం కొద్ది రోజులు బాగానే సాగినప్పటికీ.. ప్రస్తుత కాలంలో వీరి మధ్య ఏవో మనస్పార్ధాలు ఏర్పడ్డాయి.

అందువలన వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఇటీవలే వీరిద్దరూ విడాకులు కూడా తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా శ్రీజ తన పిల్లలతో హ్యాపీగా ఉంది. అలాగే ఇటీవల వరుణ్ తేజ్ వివాహానికి సైతం హాజరైంది. తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ” విషయాలు నా నియంత్రణలో లేనప్పుడు, పరిస్థితులు అస్తవ్యస్తంగా మారి శబ్దం చేసినప్పుడు, హృదయం గాయపడుతుంది.. విరిగిపోతుంది. మనస్సు కలత చెందుతుంది క్షీణిస్తుంది. శరీరం అలసిపోతుంది.. బలహీనంగా ఉంటుంది.

విరామం ఉన్నప్పుడు.. నా కళ్ళు మూసుకుని.. నిర్మలమైన అంతర్గతం ప్రపంచానికి మళ్లీ కనెక్ట్ అవుతూ గతాన్ని తలుచుకుంటాను. ఇదొక్కటే మార్గం…” అంటూ రాసుకొచ్చింది శ్రీజ. ప్రస్తుతం ఈమె రాతలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ పై స్పందించిన ప్రేక్షకులు…” ఈమెకి అంత పెద్ద కష్టం ఏమొచ్చిందని… అంతరాసుకొచ్చింది. నువ్వు నీతులు చెపుతావు కానీ పాటించవు.. చిరంజీవి గారి పరువు నీ మూలంగానే పోతుంది. ఛీ నీ బతుకు ” అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.