” ఆంటీ అనే వాళ్లందరూ కామాంధులు “… మరోసారి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన అనసూయ (వీడియో)

బోల్డ్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా ఈమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ప్రస్తుతం సినిమా రంగంలో దూసుకుపోతుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన అందాలని ఆరబోస్తుంది. అలాగే తనని ట్రోల్ చేసే వారిని సైతం ఖండిస్తుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మని ఆంటీ అని ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ట్విట్టర్ మొత్తం ఆంటీ అని పదాన్ని ట్రెండింగ్ చేశారు. దీనికి అనసూయ సైతం తనదైన శైలిలో ఇచ్చి పడేసింది.

ఆంటీ అనే వారిపై పోలీస్ కేసు పెడతానని అనడంతో దెబ్బకి ట్రోల్స్ ఆగిపోయాయి‌. ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆంటీ అంటే ఎందుకు కోపం వస్తుందో తెలిపింది. అనసూయ మాట్లాడుతూ…” నేనేమన్నా పోస్ట్ చేస్తే.. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవచ్చు కదా ఆంటీ అని అంటారు. ఆంటీ అనే పదం తప్పు కాదు. కానీ దాన్ని చాలామంది వల్గర్ గా వాడుతున్నారు. చిన్న పిల్లలు, తెలిసిన వాళ్లు వచ్చి ఆంటీ అని క్యూట్ గా పిలుస్తారు. చిన్నపిల్లలు ఆంటీ అని పిలిస్తే నాకు హ్యాపీగానే ఉంటుంది. కానీ నా ఏజ్ లో ఉన్నవాళ్లు ఆంటీ అని మరో రకంగా పిలుస్తున్నారు. ఇది నాకు నచ్చడం లేదు. అసలు ఆంటీ అని ఇంగ్లీషులో పిన్నికి, అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళని పిలవడానికి వాడుతారు ” అంటూ పేర్కొంది.

అనసూయ ఇంకా మాట్లాడుతూ… ” నేను చిన్నప్పుడు చాలామంది పక్కింటి వాళ్లని ఆంటీ అనే పిలిచే దాన్ని. ఒకవేళ వాళ్లు నన్ను అలా పిలవద్దు అంటే నేను పిలవను. నేను అలా పిలిస్తే వాళ్లు హార్ట్ అవుతున్నారని నేను అర్థం చేసుకొని ఆపేసాను. నాకు ఏదో కారణంతో నచ్చట్లేదు, నేను అదే చెప్పాను. అయినా మళ్లీ మళ్లీ ఎందుకు ఆంటీ అని కామెంట్లు చేస్తున్నారు. ఆంటీ అనే వాళ్లందరూ కామాంధులు. వాళ్లకి అక్క, చెల్లెల్లు ఉండరా. వాళ్లందరూ నీచులు…” అంటూ ఫైర్ అయ్యింది అనసూయ. ప్రస్తుతం అనసూయ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Rajesh Manne Official (@rajeshmanne1)