పెద్ద డైరెక్టర్లతో సినిమాలు ఎందుకు తీయడం లేదు అన్న.. స్టూడెంట్ ప్రశ్నకు నాని అదిరిపోయే ఆన్సర్..

nani

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దసరా సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని తాజాగా హాయ్ నాన్న‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రయోగాత్మక సినిమాలకు పెద్దపీట వేస్తూ మంచి మంచి కాన్సెప్ట్లను సెలెక్ట్ చేసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తున్న నాని.. కేవలం యంగ్‌ డైరెక్టర్ ఛాన్సల్ ఇస్తున్నాడు. అలాగే కొత్త వారికి కూడా ఛాన్సులు ఇస్తూ మంచి మంచి దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు. ఇక నాని హాయ్ నాన్న మూవీ డిసెంబర్ 7న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. కాస్త ముందుగా సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మూవీ టీం.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్లు రిలీజ్ అయ్యాయి. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో సాగే ఫస్ట్ సాంగ్ ప్రేక్షకుల్లో మంచి హైప్ తెచ్చి పెట్టింది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్‌, సాంగ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక మృనాల్ ఠాగూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా నుంచి మూడో సాంగ్ హైదరాబాద్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో రిలీజ్ చేశారు మూవీ టీం. ఇందులో భాగంగా మూవీ టీం తో అక్కడున్న స్టూడెంట్స్ ముచ్చటించారు. ఇక హీరో నాని ని కూడా కొంతమంది స్టూడెంట్స్ కొన్ని ప్రశ్నలు అడగారు.

ఓ స్టూడెంట్ నానిని ప్రశ్నిస్తూ నాని అన్న మీరు చిన్న దర్శకులతోనే సినిమాలు ఎందుకు చేస్తున్నారు పెద్ద డైరెక్టర్ కు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు అని అడాగాడు. దానికి నాని స్పందిస్తూ మీరు అనుకుంటే ఇంకా పెద్ద పెద్ద హీరోల సినిమాలు చూసేందుకు వెయిట్ చేయొచ్చు.. కానీ నా సినిమాలు కూడా ఎందుకు థియేటర్స్‌కి వచ్చి చూస్తున్నారు. ఎవరైనా మనసుకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే నాకు మనసుకు నచ్చిన సినిమాలు నేను చేస్తున్న అని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం నాని చెప్పిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజై ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.