తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా, నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ ఝాన్సీ.. కెరియర్ మొదట్లోనే పలు సినిమాలలో గుర్తింపు సంపాదించుకున్న ఇమే బుల్లితెర పైన కూడా తన హవా కొనసాగించింది. ఒకానొక సమయంలో బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన ఝాన్సీ ఈ మధ్యకాలంలో యాంకర్ గా పెద్దగా ఇక్కడ కనిపించలేదు.. కానీ అడపా దడపా సినిమాలలో తన పాత్రతో ముందుకు నెట్టుకు వచ్చి సక్సెస్ అవుతోంది.
ఇక ఝాన్సీ వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె నటుడు జోగి నాయుడుని ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించిన తర్వాత వీరిద్దరూ కొన్ని మనస్పర్ధల వల్ల విడిపోవడం జరిగింది. వీరిద్దరికి పుట్టినటువంటి కుమార్తె పేరు ధన్య.. ఈమె ఝాన్సీ వద్దని పెరుగుతోంది.. లేకపోతే ఝాన్సీ ఎప్పుడు కూడా తన కుమార్తెను ఎక్కడ చూపించలేదు కానీ తాజాగా తన కుమార్తె ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేయడం జరిగింది.
ఝాన్సీ కుమార్తె ధన్య ఫోటోని చూసిన పలువురు అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం తల్లి పోలికలతో చాలా అందంగా కనిపిస్తోందని ఏమైనా చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.. ఝాన్సీ కుమార్తె తనకంటే అందంగా ఉంది ఈమె కనుక ఇండస్ట్రీలోకి వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. తన కుమార్తె దన్య పుట్టినరోజు కావడంతో తన కుమార్తెతో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది ఝాన్సీ. తన కూతురు గురించి వివరిస్తూ గోల్డ్ అండ్ బోల్డ్ అంటూ తన కూతురు గురించి తెలియజేసింది కూతుర్లు పుట్టడం అదృష్టం అంటారు. ఈ విధంగా ఝాన్సీ కూడా తన కూతురు ఫోటోని షేర్ చేయడంతో వైరల్ గా మారుతోంది.