రూ.100 కోట్ల హీరో.. ఇప్పుడు కోటి సంపాదించడానికే తిప్పలు…

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసిన రొమాంటిక్ డ్రామా “ఉప్పెన”తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. బ్లాక్‌బస్టర్ హిట్ తో సినీ రంగప్రవేశం చేసిన ఈ హీరో తర్వాత పలు ఇంట్రెస్టింగ్ సినిమాల్లో నటించాడు. కానీ అవేవీ కూడా ఉప్పెనలాగా హిట్స్ సాధించలేదు. నిజానికి యావరేజ్ టాక్ తెచ్చుకోవడంలో కూడా విఫలమయ్యాయి. ఈ సినిమా క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి దారుణమైన రివ్యూలను అందుకున్నాయి.

అతని రెండవ చిత్రం, “కొండపొలం”, అదే పేరుతో ఉన్న ఒక నవల ఆధారంగా తెరకెక్కింది. ఇది అడవి నేపథ్యంలో సాగుతుంది. ప్రత్యేకమైన సెట్టింగ్స్, ప్రతిభావంతులైన తారాగణం ఉన్నప్పటికీ, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. బాక్సాఫీస్ ఫ్లాప్‌గా నిలిచింది.

అతని మూడవ చిత్రం, “రంగ రంగ వైభవంగా”, గ్రామీణ జీవితంతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌లలో ఒకరైన దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏది ఏమయినప్పటికీ, బలహీనమైన హాస్యం, ప్రిడిక్టబుల్ కథాంశంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

అతని నాల్గవ చిత్రం “ఆదికేశవ” కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం మతపరమైన కోణంతో రివెంజ్ డ్రామాగా వచ్చింది, అయితే ఇది నాసిరకం స్క్రీన్‌ప్లే, పూర్ డైరెక్షన్, పేలవమైన ప్రదర్శనలతో దెబ్బతింది. వైష్ణవ్ తేజ్ తన మునుపటి చిత్రాల కంటే ఎటువంటి మెరుగుదల కనబరచకుండా, తన పాత్రలో క్లూలెస్, కన్విన్స్‌గా కనిపించాడు. ఈ సినిమా క్రిటిక్స్ అత్యంత చెత్తగా ఉందని అభివర్ణించగా పరీక్షకులు కూడా సేమ్ అలాంటి టాక్‌తోనే మూవీని ఫ్లాప్ చేశారు. ఈ మూవీ కేవలం 1 కోటి షేర్ వసూలు చేసింది. ఫస్ట్ సినిమాతో రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఈ హీరో ఇప్పుడు 1 కోటి రూపాయలు అతి కష్టం మీద సంపాదించాడు. దీన్ని బట్టి అతడి కెరీర్ ఎలా పతనమైందో అర్థం చేసుకోవచ్చు.

వైష్ణవ్ తేజ్ రైజింగ్ స్టార్ నుంచి ఇప్పుడు ఫ్లాప్ స్టార్ గా మిగిలిపోయాడు. తన తొలి సినిమాతోనే సంపాదించుకున్న ఆదరాభిమానాలను, ప్రశంసలను కోల్పోయాడు. ఇకనైనా ఈ మెగా హీరో తన సినిమాల ఎంపికలను పునరాలోచించాలి. నటనా నైపుణ్యాలపై పని చేయాలి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అతనికి మరో అవకాశం రావచ్చు, కానీ దానిని వృధా చేసుకోకూడదు. అతనికి బలమైన కమ్ బ్యాక్ అవసరం లేదా పోటీ పరిశ్రమలో అతను కనుమరుగు కావచ్చు.