చపాతీలు మెత్తగా రావాలంటే ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అవ్వండి…!!

చాలామంది షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి చపాతీలను తింటూ ఉంటారు. ఓ పూట భోజనం, మరో పూట , చపాతీలు కూడా తింటారు. డాక్టర్లు కూడా చపాతీలు తినడం వల్ల బరువు తగ్గుతారు అని చెబుతూ ఉంటారు. చాలామంది చపాతీలను తయారు చేయడంలో విఫలమవుతూ ఉంటారు.

చపాతీలు మృదువుగా, మెత్తగా రావాలంటే ఇలా ట్రై చేయండి. ముందుగా గోధుమ పిండిని.. వేడి నీళ్లతో కలుపుకొని.. నానబెట్టి ఉంచుకోవాలి. అలా ఒక ఐదు నిమిషాల తర్వాత పిండి పై నూనె అద్దాలి. అనంతరం చపాతి పలసగా చేసుకొని.. పెనం హీటెక్కిన తరువాత.. నూనె వేసి కాల్చాలి.

అనంతరం మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోండి. ఇలా చపాతీలను తయారు చేసుకు తింటే త్వరగా అరుగుతుంది కూడా. ఇలా తినడం వల్ల జీర్ణశైలి పనితీరు మెరుగుపడుతుంది. అలాగే చిన్న పిల్లలకి కూడా చపాతి పెట్టడం వల్ల వాళ్ళ ఎనర్జీ రెట్టింపు అవుతుంది.