జీవితంలో ఒక్కసారి అయినా ఈ పండ్లను తినాల్సిందే.. ఎన్నో రోగాలకు చెక్..!!

సాధారణంగా మన చుట్టూ దొరికేటువంటి కొన్ని పండ్లు, ఆకులు, బెరడు మన తింటూ ఉండడం వల్ల పలు రకాల ఉపయోగాలు ఉంటాయి.. అలా మన చుట్టూ దొరికే మూలికలలో అత్యంత ముఖ్యమైన మూలికలలో మల్బరీ జాతికి చెందిన మల్బరీ జాతి కూడా ఒకటి.. తూర్పు ఆసియా తెలుపు మల్బరి..నైరుతి ఆసియా నలుపు మల్బరీ గా పిలవబడుతుంది. ఈ పండు తినడానికి చాలా రుచిగా కూడా ఉంటుంది. మల్బరీ పండు ఇండియాలో ,జపాన్, అరేబియా, చైనా, దక్షిణ ఐరోపా వంటి సమ శీతోష్ణ ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుందట.

ఎక్కువగా పట్టుపురుగులకు మల్బరీ ఆకులను మాత్రమే ఆహారంగా ఉంచుతారు. అందుకే గ్రామాలలో వీటి గురించి బాగా తెలుస్తూ ఉంటుంది.. ఈ ఆకులలో బెరడులో పండ్లలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. మల్బరీ అసాధారణంగా శరీరంలో రక్తం గడ్డ కట్టడాన్ని సైతం నివారిస్తుందట. మల్బరీ మొక్కలలో వివిధ భాగాలు పలు రకాల ఔషధ లక్షణాలను కూడా అందిస్తాయి. జ్వరాన్ని వాపులను సైతం తగ్గించడానికి మల్బరీ చాలా సహాయపడుతుంది.

మల్బరీ పండ్లలో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు చాలా ఉంటాయట. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా చాలా సహాయపడుతుంది. చర్మం, జుట్టు పెరగడానికి కూడా ఈ మల్బరీ పనులు చాలా మేలు చేస్తాయి. మల్బరీ లో ఐరన్ పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. ఇందులో ఉండే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిని సైతం పెంచడానికి సహాయపడతాయి. మల్బరీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి ఇవి క్యాన్సర్ వంటి ప్రమాదాన్ని కూడా దూరం చేయగలవు.. ఈ ఆకు రక్తం గొంతు ఇన్ఫెక్షన్ మంట ఇతరత్రా వాటిపైన బాగా పనిచేస్తుందట.