ఆ టాలీవుడ్ హీరో తో మల్టీస్టారర్ కి రెడీ అంటున్న నాని.. !!

నాచురల్ స్టార్ నాని ఇటీవల హీరోగా నటించిన మూవీ హాయ్ నాన్న. మృణాల్‌ల్ ఠాగూర్ హీరోయిన్‌గా బేబీకి అద్వానీ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్‌తో రూపొందుతుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో భాగంగా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేశారు మూవీ టీం. ఇక ఈవెంట్లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాని పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాతో షేర్ చేసుకున్నాడు ఈ క్రమంలో మీడియా నుంచి నానికి తన సినిమాలు మంచి టాక్ వచ్చిన కమర్షియల్ సక్సెస్ అవ్వట్లేదు అంటూ క్వశ్చన్ ఎదురయింది దానిపై నాని స్పందిస్తూ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చాడు.

జెసీ, శ్యామ్ సింగ్ రాయ్‌ లాంటి సినిమాలకు ప్రాఫిట్స్ వచ్చాయని.. ఒక సినిమా బిజినెస్ విషయంలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటి మెలుకువలు అసలు విషయం తెలియకుండా లాస్ అని చెప్పడం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చాడు. తన నిర్మాతలు తన సినిమా వల్ల చాలా హ్యాపీగా ఉన్నారని ప్రెస్మీట్‌లో చెప్పాడు. తర్వాత జెర్సీ, శ్యామ్‌ సింగర్ నిర్మాతలు కూడా నానికి సపోర్ట్ చేస్తూ ట్విట్టర్‌లో మెసేజ్లు పెట్టారు. దీంతో ప్రెస్ మీట్ లో హీరోలను నెగిటివ్ చేయడానికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న మీడియాకు నిర్మాతలు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.

ఈ క్రమంలో మల్టీ స్టార‌ర్స్ కి రెడీ అంటూ నాని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ తో మల్టీ స్టార‌ర్ ఎప్పుడు అని ఇంటర్వ్యూవర్‌ ప్రశ్నించగా నాని – విజయ్ కెరీర్ స్టార్ట్ చేసిందే మల్టీస్టారర్‌తో తనని ఎప్పుడు కలిసిన మళ్ళీ ఆన్ స్క్రీన్ మల్టీస్టారర్ ఎప్పుడు చేద్దాం అనే విషయం పైన డిస్కస్ చేసుకుంటా విజయ్ తో మళ్ళీ కలిసి నటించడానికి నేను రెడీ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నాని నటిస్తున్న హాయ్ నాన్న సినిమాకు శౌర్య‌వ్ దర్శకత్వం వహించాడు. మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వాహెబ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజై ఎటువంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.