`స‌లార్` న‌టుడు పృథ్వీరాజ్ వైఫ్‌ను ఎప్పుడైనా చూశారా.. హీరోయిన్లు కూడా కుల్లుకునే అందం ఆమె సొంతం!

మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న‌టుడిగానే కాకుండా డైరెక్ట‌ర్ గా, నిర్మాత‌గా, గాయ‌కుడిగానూ స‌త్తా చాటుతూ ఆల్ రౌండ‌ర్ గా పేరు తెచ్చుకున్న‌ పృథ్వీరాజ్.. త్వ‌ర‌లోనే తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌బోతున్నాడు. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న‌ `స‌లార్‌` మూవీలో పృథ్వీరాజ్ ప‌వ‌ర్ ఫుల్ రోల్ ను పోషిస్తున్నాడు.

ఇటీవ‌ల స‌లార్ నుంచి పృథ్వీరాజ్ ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు రాగా.. దానికి మంచి రెస్పాన్స్ ద‌క్కింది. ఈ క్ర‌మంలోనే పృథ్వీరాజ్ గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకునేందుకు తెలుగు సినీ ప్రియులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. 1982లో సెల‌బ్రిటీ కపుల్‌ సుకుమారన్, మల్లికలకు రెండో సంతానంగా పృథ్వీరాజ్ జ‌న్మించాడు. నటుడు ఇంద్రజిత్ పృథ్వీరాజ్ సోదరుడు. చ‌దువుకుంటున్న రోజుల్లోనే ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ పృథ్వీరాజ్.. హీరోగా ఇప్ప‌టి వ‌రకు ఎన్నో హిట్ సినిమాల్లో న‌టించాడు.

నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా మ‌రియు గాయ‌కుడిగా త‌న‌ను తాను నిరూపించుకున్నాడు. 2011లో పృథ్వీరాజ్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. సుప్రియా మీనన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్లు కూడా కుల్లుకునే అందం సుప్రియా మీన‌న్ సొంతం. వివాహానికి ముందు సుప్రియ బీబీసీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ గా వ‌ర్క్ చేశారు.

పృథ్వీరాజ్ తో ఏడ‌డుగులు వేశాక జాబ్ కు రాజీనామా చేసి త‌న పూర్తి స‌మ‌యాన్ని ఫ్యామిలీకే కేటాయించింది. 2014లో ఓ పాపకు జన్మ‌నిచ్చింది. ఆ పాప పేరు అలంకృత. ప్ర‌స్తుతం భార్య‌, కూతురుతో పృథ్వీరాజ్ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు.