పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్టింగ్ లో ఆ పని చేశారా? బయటపడ్డ అసలు నిజం…!!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలను మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పవన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. పవన్ ఇటీవల బ్రో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన ఈ రీమిక్స్ సినిమా అంచనాలు అందుకోలేదు. పవన్‌ ప్రస్తుతం ఓజి – ఉస్తాద్ భగత్ సింగ్ – హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తున్నారు.

పవన్ స్వతహాగా హీరో మాత్రమే కాదు.. ఆయన ఒక ఫైట్ మాస్టర్.. ఆయనలో ఒక డైరెక్టర్ కూడా దాగి ఉన్నాడు.ఖుషి, జానీ లాంటి సినిమాలకు పవన్ ఫైట్లు స్వయంగా కంపోజ్ చేసుకున్నాడు. అలాగే పవన్ తన సినిమాలో కొన్ని సీన్లు కూడా డైరెక్ట్ చేసుకున్నాడు. పవన్ కెరీర్ స్టార్టింగ్ లో హీరో అవ్వాలనే ఆలోచనే లేదట. డైరెక్టర్ కావాలని భావించాడట. కానీ కుటుంబ సభ్యులు వద్దనడంతో పవన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట.

పైగా తన సోదరుడు చిరంజీవికి డైరెక్టర్గా మారడం అస్సలు నచ్చలేదట. ఇకపోతే ఈ హీరో దర్శకుడు కావాలనుకున్న టైంలో ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడట. న్యూయార్క్ ఫిల్మ్‌ అకాడమిలో షార్ట్ ఫిల్మ్‌ టర్మ్ కోర్స్ కోసం ఈ హీరో అప్లికేషన్ చేశాడట. దీంతో ఒక స్మార్ట్ ఫిల్మ్‌ను కూడా తీసి వారికి పంపారట. ఈ స్మార్ట్ ఫిల్మ్ లో అంధుల జీవితాల గురించి ఉంటుందట. కాగా మన పవర్ స్టార్.. స్మార్ట్ ఫిలిమ్ ను యూట్యూబ్ లో అందుబాటులోకి తెస్తే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.