వన్ ప్లస్ నుంచి 100 w ఫాస్ట్ ఛార్జింగ్తో పోర్టబుల్ మొదటి స్మార్ట్ మొబైల్..!!

ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ సంస్థలలో ఒకటైన one plus మొదటిసారి తన పోర్టబుల్ మొబైల్ ని అక్టోబర్ 19వ తేదీన రాత్రి 7:30 నిమిషాలకు ఇండియాలో విడుదల కాబోతున్నది.. వన్ ప్లస్ ఓపెన్ వీడియో ఫొటోస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం లో షేర్ చేయడం జరిగింది. ఈ మొబైల్ నుంచి స్పెసిఫికేషన్స్ మరింత సమాచారాన్ని మాత్రం ఇవ్వలేదు. అయితే ఈ స్మార్ట్ మొబైల్ అంచనా స్పెసిఫికేషన్ గురించి పలు రకాల మీడియా సంస్థలు కొన్ని నివేదికలలో తెలియజేయడం జరిగింది.

One plus open:
ఈ మొబైల్ స్పెసిఫికేసన్ విషయానికి వస్తే.. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేటుతో డ్యూయల్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుందట.. ఈ డిస్ప్లే సైజు విషయానికి 7.8 అంగుళాల కవర్ డిస్ప్లే కలదు.

హార్డ్వేర్ పనితీరు విషయానికి వస్తే ఈ మొబైల్లో ప్రత్యేకంగా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 GEN -2 ప్రాసెస్ అందిస్తుందట. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా OS పైన పనిచేస్తుందట.

కెమెరా విషయానికి వస్తే.. మొబైల్ ప్యానెల్ వెనకవైపు..48+48+64MP కెమెరా సెట్ అప్ తో కలదు అయితే మెయిన్ డిస్ప్లేలో ఏదైనా కెమెరా కనిపిస్తుందా లేదా అనే విషయం పైన ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదట.

చార్జింగ్ విషయానికి వస్తే నివేదికల ప్రకారం వన్ ప్లస్ ఓపెన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4,800 MAH సామర్థ్యం కలిగిన బ్యాటరీని కలిగి ఉన్నది.

కొన్ని మీడియాపోర్టబుల్ తెలిపిన వివరాల ప్రకారం మొబైల్ ఇండియాలో ధర విషయానికి వస్తే 1.10 లక్షల నుంచి 1.20 లక్షల మధ్య ఉండబోతోందని సమాచారం.. అయితే ఈ మొబైల్ సాంసంగ్ గెలాక్సీ ZFODS -5 కంటే చౌకైన మొబైల్ కలదు ప్రస్తుతం దీని ధర 1.50 లక్ష రూపాయల వద్ద ఉన్నట్లు సమాచారం.