టైట్ స్కిన్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ గురించి మన తెలుగు వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నిన్నమొన్నటి వరకు తెలుగు తెరపైన ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసింది. అవును, ఏమే ప్రస్తుతం హిందీలో మాత్రం బిజీగా గడుపుతుంది. అక్కడికి వెళ్ళిన తరువాత ప్రియుడు కూడా సెట్ అయ్యాడు ఆమెకి. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ పీక్ స్టేజ్‌ని చూసేసింది. టాలీవుడ్లో బిగ్ స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది. తెలుగులో ఆఫర్లు కాస్త నెమ్మదించడంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. ఈ క్రమంలో అక్కడ ఒకేసారి పదికిపైగా సినిమాలకు కమిట్ అయ్యింది ఈ అమ్మడు.
ఆ రకంగా బాలీవుడ్‌లో రెండు మూడేళ్లుగా ఆమె క్షణం తీరికలేకుండా గడుపుతుంది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుండటం విశేషం. అంత బిజీగా ఉన్నా తన ప్రేమని మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. ప్రియుడు జాకీ భగ్నానీతో ఫ్రీ టైమ్ చూసుకొని చెట్టపట్టాలేసుకొని తిరిగేస్తోంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన బర్త్ డే జరుపుకుంది. మంగళవారం నాటికి ఆమె 33ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంది రకుల్. ఈ నేపధ్యంలో తన బర్త్ డే సందర్భంగా ప్రియుడు జాకీ భగ్నానీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ పోస్టులో తన గర్ల్ ఫ్రెండ్‌ని ఆకాశానికి ఎత్తేశాడు జాకీ. ఇందులో ఆయన పేర్కొంటూ… “ఈ ప్రత్యేకమైన రోజున నన్ను నిత్యం సర్‌ప్రైజ్ చేసే వ్యక్తి గురించి నా అభిమానాన్ని చాటుకోవాలని అనుకుంటున్నాను. నీతో ఉంటే ప్రతి రోజు ఒక అద్బుతమైన ప్రయాణంలా అనిపిస్తుంది. అలసిపోయిన ఫీలింగే కలగదు. నువ్వు నా జీవిత భాగస్వామి కంటే ఎక్కువ. నువ్వే నా ధైర్యం. నా ప్రతి అడుగులో నువ్వే నా పార్ట్ నర్. ఈ గొప్ప రోజున నువ్వు కన్న కలలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకుంటే నువ్వు మాత్రమే జీవితంలో ఉత్తమమైన వాటిని సాధించడానికి అర్హురాలివి.” అని క్రేజీగా పోస్ట్ పెట్టాడు జాకీ. కాగా దీనికి రకుల్ స్పందిస్తూ… “మీ విశేష్ నన్ను మెప్పించింది. వాహ్ అనేలా చేసింది. థ్యాంక్యూ మై లవ్” అని పేర్కొంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె అభిమానులు “రకుల్! జాగ్రత్త నిన్ను మునగ చెట్టు ఎక్కుస్తున్నాడు!” అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
రకుల్ ని మునగచెట్టు ఎక్కిస్తూ ప్రియుడి బర్త్ డే విషెస్!
