సమంత ఉసురు తగిలి సిద్ధార్థ కెరీర్ ఇలా.. ప్రముఖ జర్నలిస్ట్ సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఓన్ టాలెంట్‌తో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో సిద్ధార్థ ఒకరు. అప్పట్లో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సిద్ధార్థ ప్రేక్షకులు ఊహించని స్థాయిలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ సంపాదించుకున్నాడు. బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బాస్టర్ హిట్లు తనకు దక్కాయి. ల‌వర్ బాయ్‌గా ఇమేజ్‌ను సంపాదించుకున్న సిద్ధార్థ్‌కు తర్వాత అడపాదడపాక విజయాలు వచ్చినా అత్యధిక ఫ్లాపులతో టాలీవుడ్‌కి దూరమయ్యాడు.

అయితే సిద్ధార్థ్‌ను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డైరెక్టర్ తొక్కేసారనే టాక్ కూడా వినిపిస్తూ ఉండేది. సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఇంటర్వ్యూలో సిద్ధార్థ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు హరినాథ్ ఒక వెలుగు వెలిగి చివరి దశలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడని.. ఇతను పేర్కొన్నాడు. సమంత – సిద్ధార్థ మధ్య రిలేషన్ అందరికీ తెలుసని ఇమంది రామారావు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. సిద్ధార్థ కు సమంత ఉసురు తగిలిందని ఇమంది రామారావు కామెంట్స్ చేశాడు. సిద్ధార్థ క్యారెక్టర్ లేదని ఆయన వివరించాడు.

టాలెంట్ ను ఇండస్ట్రీ ఉపయోగించుకుంటుందని సిద్ధార్థ ఊహించని స్థాయిలో టాలెంట్ ఉన్న హీరో కాదని ఆయన చెప్పుకొచ్చాడు. సిద్ధార్థ్‌కు ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సిద్ధార్థ్‌ చేతులారా తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడని అతడు వివరించాడు. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఉంటే చాలా ఎక్కువ సంవత్సరాలు కెరీర్‌ను కొనసాగించవచ్చని ఆయన పేర్కొన్నాడు. సిద్ధార్థ్‌ వ్యక్తిగత జీవితంలో వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ కారణంగానే సిద్ధార్థ సినీ కెరీర్ ఇలా మారిపోయింది అంటూ ఆయన కామెంట్స్ చేశాడు.