`టైగర్ నాగేశ్వరరావు` ప్రీ రిలీజ్‌ బిజినెస్.. హిట్ కొట్టాలంటే ర‌వితేజ ఎంత రాబ‌ట్టాలి?

మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ `టైగర్ నాగేశ్వరరావు`. 70వ దశకంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టెర్ర‌ర్ సృష్టించిన‌ గ‌జ దొంగ‌ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా న‌టించారు.

అక్టోబ‌ర్ 20న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే టీజ‌ర్‌, ట్రైల‌ర్ తో సినిమాపై అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ‌గా.. ప్ర‌మోష‌న్స్ తో మ‌రింత హైప్ పెంచుతున్నారు. ఇందుకు త‌గ్గ‌ట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జ‌రిగింది. ర‌వితేజ కెరీర్ లోనే హ‌య్యెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది.

కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు థియేట్రిక‌ల్ రైట్స్ ను ఏకంగా రూ. 31 కోట్ల‌కు కొనుగోలు చేశారు. అలాగే వర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 37.50 కోట్లు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38.50 కోట్లు. ఈ టార్గెట్ ను అందుకుంటేనే ర‌వితేజ ఖాతాలో హిట్ ప‌డుతుంద‌ని సినీ పండితులు చెబుతున్నారు. ఇక ఏరియాల వారీగా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌లు ఇలా ఉన్నాయి..

నైజాం: 8.60 కోట్లు
సీడెడ్: 5.40 కోట్లు
ఆంధ్రా: 17 కోట్లు
————————
ఏపీ+తెలంగాణ‌= 31.00 కోట్లు
————————

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 4 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 3 కోట్లు
————————–
వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్‌= 37.50 కోట్లు(బ్రేక్ ఈవెన్ ~ 38.50కోట్లు)
————————–