రాత్రిపూట దోసెలు తింటున్నారా.. అయితే ఎంత ప్రమాదమో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ డైట్ ఫాలో అవుతూ పలు రకాల వాటిని తినడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట భోజనం చేయడానికి వదిలేస్తూ ఉన్నారు. దీంతో టిఫిన్ లేదా ఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తింటూ ఉన్నారు.. ఇలా దోస ఇడ్లీ వంటి వాటిని పులియపెట్టిన పిండితో తయారు చేసిన వాటిని ఎక్కువగా తింటున్నారు. అయితే ఇలా పులియ పెట్టిన వాటిని తినడం వల్ల జీర్ణశక్తికి మంచిదే కానీ రాత్రి సమయాలలో తినడం చాలా ప్రమాదమని నిపుణులు తెలియజేస్తున్నారు.

గర్భిణీ స్త్రీలు , పాలిచ్చేవారు మాత్రం రాత్రి సమయాలలో ఇలాంటి ఆహారాన్ని అసలు తీసుకోకూడదట.. అయితే ఇలా తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో కడుపు చాలా అసౌకర్యంగా అనిపిస్తుందట. అలాగే పన్నీర్, పెరుగు వంటి వాటిని కూడా దూరంగా ఉంచాలి.. కొంతమంది జీర్ణ సమస్యలు కూడా వెలుపడుతూ ఉంటాయి. ముఖ్యంగా కడుపు ఉబ్బరం ఉన్నవాళ్లు రాత్రిపూట పులియబెట్టిన ఆహారానికి దూరంగా ఉండడం మంచిది.

దోశ, ఇడ్లీ వంటివి పులియపెట్టిన వాటిని తగ్గించడం చాలా మంచిది. అయితే ఫుడ్ అలర్జీతో ఇబ్బంది పడేవారు మాత్రం ఇలాంటి వాటిని అస్సలు ముట్టుకోకపోవడమే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అలాంటి వారు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఆ జీర్ణ సమస్యలతో పాటు తీవ్రమైన తలనొప్పి సమస్యను కూడా ఎదుర్కొంటారట.

పులియబెట్టిన ఫుడ్స్ లో జీర్ణశక్తిని పెంచి ఆరోగ్యాన్ని జీర్ణాశయంలో కూడా మంచి బ్యాక్టీరియాని సైతం ఉత్పత్తి పెంచేలా చేస్తాయి వీటివల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అయితే ఇందులో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండడం వల్ల వీటిని ఉదయాన్నే తీసుకోవడమే చాలా మంచిది రాత్రిపూట తీసుకుంటే శరీరానికి చాలా నష్టం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. కావాలంటే ఒకసారి తేడాని గమనించిన తర్వాతే ఇలా చేయడం మంచిది.