పేట, మాస్టర్ మూవీలలో తన నటనతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది మాళవిక మోహన్. ప్రస్తుతం విక్రమ్ హీరోగా పరంజిత్ రూపొందిస్తున్న తంగలాన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది ఈ బ్యూటీ. ఇక తాజాగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించిన ఈ బ్యూటీ పలు ఆసక్తికర విషయాలను ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ఈ నేపథ్యంలో తంగలన్ ఆలస్యం గురించి అభిమానులు అడగగా.. ఈ విషయం పారంజిత్‌ని అడగాలి అంటు చెప్పుకొచ్చింది.
నా వరకు అయితే ఈ మూవీ చాలా స్పెషల్ అని యాక్టర్ గా అందులోని పాత్ర నాకు ఓ ఛాలెంజ్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో నటించే ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు తెచ్చే మూవీ ఇది అవుతుందని మాళవిక వివరించింది. మీ ఇష్టమైన హీరో ఎవరు అని అభిమాని ప్రశ్నించగా తడుముకోకుండా పహధ్ ఫాజిల్ అంటూ చెప్పింది.
మిగతా హీరోలకు కోపం వస్తే అనంటే.. రానివ్వండి అబద్ధాల్లో బతకడం చాలా కష్టం నా అభిప్రాయాన్ని నేను చెప్పా అంటూ ధైర్యంగా సమాధానం ఇచ్చింది. మీ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా అని అడగగా రాజకుమారిగా పిరియాడికల్ మూవీ లో చేయాలనుకుంటున్నా అంటూ మనసులో కోరికను చెప్పుకొచ్చింది మాళవిక. మాళవిక ఫ్యాన్స్ తో చేసిన ఈ చిట్ చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.