సాయి ప‌ల్ల‌విని బెడ్రూమ్‌కి పిలిచిన టాలీవుడ్ డైరెక్ట‌ర్‌.. తెలివిగా తిక్క కుదిర్చిన హైబ్రిడ్ పిల్ల‌!

సాయి పల్లవి.. ఈ హైబ్రిడ్ పిల్ల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఫిదా మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల భామ.. తొలి సినిమాతోనే సూపర్ డూప‌ర్‌ హిట్ ను ఖాతాలో వేసుకుంది. త‌న‌దైన‌ అందం అభినయం మరియు డ్యాన్సులతో తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల చెంత చేరింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

కొందరైతే ఆమెను లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుస్తుంటారు. అంతలా ప్రేక్షకులకు చేరువైన సాయి పల్లవి.. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సాయి పల్లవి కి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో వివాస్పద టాపిక్ కాస్టింగ్ కౌచ్. ఇటీవల కాలంలో చాలామంది నటీమణులు ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి తాము కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నామంటూ గ‌ళం విప్పుతున్నారు.

అయితే న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా కెరీర ఆరంభంలో కాస్టింగ్ ఎదుర్కొందట. టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్‌ డైరెక్టర్ ఆమెను కమిట్మెంట్ అడిగాడ‌ట‌. పడక సుఖం అందిస్తే తన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని సాయి పల్లవితో అన్నాడట. దాంతో హైబ్రిడ్ పిల్ల భ‌య‌ప‌డ‌కుండా చాలా తెలివిగా సదరు డైరెక్టర్ తిక్క కుదిర్చింద‌ట‌. క‌మిట్మెంట్ అడ‌గ‌గానే.. సాయి ప‌ల్ల‌వి స‌ద‌రు డైరెక్ట‌ర్ పై ఫుల్ ఫైర్ అయింద‌ట‌. లీగల్ యాక్షన్ తీసుకుంటానని.. నిన్ను బ‌జారుకీడుస్తాన‌ని హెచ్చరించింద‌ట‌. దాంతో స‌ద‌రు డైరెక్ట‌ర్ త‌ప్పు అయిందంటూ సాయి ప‌ల్ల‌వికి క్ష‌మాప‌ణ చెప్పాడ‌ట‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియ‌దు గానీ.. ప్ర‌స్తుతం ఈ న్యూస్ మాత్రం నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.