గుమ్మడి గింజలతో అదిరిపోయే లాభాలు..!!

ప్రతి ఒక్క పండులో కాయలలో ఏదో ఒక ఆరోగ్య రహస్యం ఉండనే ఉంటుంది.. అయితే గుమ్మడికాయ గింజలలోనే కాకుండా కాయ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. గుమ్మడి గింజలలో అద్భుతమైన పోషక ఆహార ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా సూపర్ ఫుడ్ గా గుమ్మడికాయ విత్తనాలను పిలుస్తూ ఉంటారు. అలాగే పలు రకాల సలాడులో ఉపయోగించడమే కాకుండా ఇతరత్రా వాటిలలో కూడా జోడిస్తూ ఉంటారు. గుమ్మడికాయ విత్తనాలు తినడం వల్ల మానసిక స్థితి నిర్వహించడంతో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

గుమ్మడికాయ విత్తనాలలో మెగ్నీషియం, జింక్ యాంటీ ఆక్సిడెంట్ ఇతర అవసరమైన విటమిన్ల ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. అయితే క్యాలరీలు ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తగిన మోతాదులోనే తీసుకోవాలి గుమ్మడికాయ గింజలు ఎక్కువగా కాలేయం మూత్రశయం కీళ్ల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

గుమ్మడికాయ గింజల వల్ల మెగ్నీషియం జింక్ ఆరోగ్యకరమైన కొవ్వు వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.

గుమ్మడి గింజలలో పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల కనీసం నెలలో ఒకసారైనా వీటిని తింటే శరీరంలో అన్ని భాగాలకు సైతం అవసరమైన ఖనిజాలు లభిస్తాయట.

అధికంగా ఇందులో మెగ్నీషియం కంటెంట్ ఉండడం వల్ల రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

గుమ్మడికాయ గింజలలో జింక్ ఉండడం వల్ల ఇది మన శరీరానికి అంటూ వ్యాధులు రాకోకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించేలా సహాయపడుతుంది.

గుమ్మడికాయను ఎలా తిన్నా సరే చాలా పోషకాలు లభిస్తాయట.

గుమ్మడి గింజలలో కెరోటినాఇడ్లు , విటమిన్ ఈ ఉండడం వల్ల గ్యాస్ ట్రిక్ సమస్యలతో పాటు పేగు క్యాన్సర్ వంటి వాటిని కూడా తరిమి కొట్టగలదు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే వీటిని తరుచూ తింటూ ఉండాలి.