ఆ నలుగురు హీరోలకు షాక్.. రెడ్ కార్డ్ జారీ

కోలీవుడ్ హీరోలకు షాక్ తగిలింది. నలుగురు హీరోలపై రెడ్ కార్డ్ జారీ చేయడం కలకలం రేపుతోంది. చెన్నైలోని తమిళ్ ప్రొడ్యూర్స్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏకంగా కోలీవుడ్‌కు చెందిన టాప్ హీరోలైన ధనుల్, శింబు, విశాల్, అథర్వలకు రెడ్ కార్డులు జారీ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. చెన్నైలో సినీ నిర్మాతల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తమిళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. వీరిపై పలువురు ఫిర్యాదులు చేయడంతో రెడ్ కార్డ్ వేసినట్లు తమిళ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

సినీ నిర్మాతలకు సహకరించకపోవడంతో పాటు వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీరిపై కఠిన చర్యలకు నిర్మాతల మండలి ఉపక్రమించింది. అన్బానవన్ అసరాదవన్ అడంగావన్ సినిమా షూటింగ్ సమయంలో 60 రోజులు పనిచేస్తానన్న నిబంధనను శింబు పాటించలేదు. షూటింగ్‌కు సరైన సమయంలో రాకపోవడం వల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లింది. దీంతో నిర్మాత మైఖేల్ రాయప్పన్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు. ఇక ప్రస్తుతం నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి రామస్వామి నిర్మాణంలో ధనుష్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు షూటింగ్ కు ధనుష్ హాజరుకాకపోవడం వల్ల నిర్మాతకు నష్టం జరిగింది.

ఇక గతంలో విశాల్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో నిధులను దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక మథియాజ్ కజన్ తో వివాదం కారణంగా అథర్వకు రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల జూన్ లో శింబు, విశాల్, ఎస్ జే సూర్య, అథర్వ, యోగి బాబుతో పాటు పలువురు నటుకు నిర్మాతల మండలి హెచ్చరికలు జారీ చేసింది. నిర్మాతలతో వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించింది. కానీ హీరోలు పట్టించుకోకపోవడంతో రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేసింది. రెడ్ కార్డు పొందిన వ్యక్తులు తదుపరి నోటీసులు వచ్చేంతవరకు కోలీవుడ్ నిర్మాతలతో కలిసి పనిచేయడానికి వీలు పడదు.