మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న ఉప్పెన బ్యూటీ..!!

ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది యంగ్‌ బ్యూటీ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాథాలో వేసుకున్న ముద్దుగుమ్మ తర్వాత వ‌రుస అవకాశాలు అందుకుంది. అయితే ఈ సినిమాలతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాకపోవడంతో వరుస‌ పరాప‌జయాలను అందుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎకబోతుంది అన్న న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే వరుడు టాలీవుడ్ లోని బడా ఫ్యామిలీకి చెందిన హీరోనేనని టాక్ వినిపిస్తుంది. ఇక విషయానికి వస్తే ఉప్పెన సినిమాతో వైష్ణవ తేజ్ కు ఈ హీరోయిన్‌గా న‌టించిన కృతికి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని.. దీంతో అప్పటినుంచి రిలేషన్‌షిప్ కొనసాగుతుందని.. త్వరలోనే వైష్ణవ్ – కృతి వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారని తాజా ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. ఈ విషయాన్ని కృతి శెట్టి తన తల్లిదండ్రులకు కూడా చెప్పడంతో వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట.

ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ నటిజన్స్ మాత్రం లావణ్య బాటలోనే నువ్వు కూడా అడుగులు వేస్తున్నావా కృతి అంటూ.. ఆల్ ది బెస్ట్ కృతి శెట్టి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్ద‌రి క‌పుల్ ఎలా ఉంటుందో అంటూ మెగ ఫ్యాన్స్ అప్పుడే ఊహాగానాలు కూడా మొద‌లు పెట్టుసారు.