నెల జీతానికి పని చేస్తున్న హీరో గోపీచంద్.. మరి అంత దారుణమా..?

టాలీవుడ్ లో మొదట కొన్ని సినిమాలలో విలన్ గా నటించి మళ్లీ హీరోగా సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరో గోపీచంద్ కూడా ఒకరు.. తొలివలపు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. హీరోగా యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం తదితర చిత్రాలను నటించి మంచి క్రేజ్ అందుకున్న గోపీచంద్ చివరిగా రామబాణం సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకుంది.

Gopichand to do a punchy film with A Harsha

అయితే దాదాపుగా గోపీచంద్ కు సరైన సక్సెస్ రాక కొన్ని సంవత్సరాలు పైనే అవుతోంది .సిటీ మార్ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఆ తర్వాత పక్కా కమర్షియల్, రామబాణం సినిమాతో డిజాస్టర్ ని అందుకున్నారు. దీంతో ఒక్కసారిగా గోపీచంద్ పరిస్థితి మారిపోయింది. బిజినెస్ కూడా అంతంత మాత్రమే జరుగుతూ ఉండడంతో రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఊహించిన విధంగా మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఒకప్పుడు రూ .5కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న గోపీచంద్ ఇప్పుడు నెల జీతం లెక్కన పనిచేయడానికి సిద్ధమయ్యాడని సమాచారం.

ఒక్కో సినిమా మీద ఎన్ని నెలలు పని చేస్తే అన్ని నెలలు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం విన్న అభిమానుల సైతం ఎలాంటి హీరో ఇలా అయ్యారేంటబ్బా అంటూ అయోమయంలో పడిపోతున్నారు. గోపీచంద్ కెరియర్ లో ఒక్క సినిమా సూపర్ హిట్ అయితే చాలు ఇక మళ్ళీ ఫామ్ లోకి వస్తారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం భీమ అనే సినిమాతో పాటు శ్రీను వైట్లతో మరొక సినిమా చేస్తున్నాడు.