సిద్ధు-నాగచైతన్య ని కాకుండా..సమంత మరో హీరో ని కూడా ప్రేమించిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంతను జనాలు ఎలా లైక్ చేస్తూ ఉంటారో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తన పేరుని ఎలా మారుమ్రోగిపోయేలా చేసుకునిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. నాగచైతన్య కంటే ముందే హీరో సిద్ధార్ధ్ ను ప్రేమించింది సమంత అంటూ కూడా వార్తలు వినిపించాయి . అయితే హీరో సిద్ధార్ధ్ నాగచైతన్య కంటే ముందే సమంత మరో స్టార్ హీరోని ప్రేమించింది .. ఇష్టపడింది అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ హీరో మరెవరో కాదు కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ .

ఆమె చదువుకునే టైం నుంచి రజనీకాంత్ అంటే చాలా చాలా ఇష్టమట. ఆయన సినిమాలను అస్సలు మిస్ కాకుండా చూసేదట . బెడ్ రూమ్ నిండా ఆయన ఫొటోస్ నింపేసుకునేదట . కొన్నిసార్లు వాళ్ళ అమ్మగారు కూడా తిట్టేవారట . ఇంత పిచ్చి అభిమానమా అంటూ అరిచేదట . కానీ సామ్ అవి అంత ఏం పట్టించుకునేది కాదట . ఆయన సినిమా రిలీజ్ అయిందా..? చూసామా..? ఎంజాయ్ చేసామా..? అన్న విధంగా ఉండేదట. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక ఆయనతో ఒక్క సినిమాలోనైనా నటించాలి అని అనుకునేదట. కానీ ఇప్పటివరకు ఆ కోరిక తీరలేదు .. అలా సమంత హీరో సిద్ధార్థ చైతన్య కంటే ముందే రజనీకాంత్ ను ఇష్టపడింది ఓ అభిమానిలా..!!