బట్టలు లేకుండా మహేశ్ ని తెర పై చూపించాలి అనుకున్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? ఆ సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాక ఎలాంటి రోల్స్ నైనా చేయగలగాలి ..ఎలాంటి బోల్డ్ సీన్స్ లోనైనా నటించగలగాలి.. అప్పుడే ఓ హీరోగా సక్సెస్ అవ్వగలరు.. అయితే నేను స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అలాంటి సీన్స్ చేయను.. ఇలాంటి సీన్స్ చేయను అంటే ఇండస్ట్రీలో పైకి ఎదగలేరు. అలాంటి వి ఏం పెట్టుకోకుండా స్టార్ హీరోగా ఎదిగాడు సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు. సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో మనకు తెలిసిందే . ప్రజెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్న మహేష్ .. త్వరలోనే దర్శక ధీరుడు గా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి డైరెక్షన్లో క్రేజీ ప్రాజెక్టును ఓకే చేశాడు.

కాగా ఇలాంటి క్రమంలోనే మహేష్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . నిజానికి ఓ స్టార్ డైరెక్టర్ మహేష్ బాబుని న్యూడ్ గా చూపించాలి అని అనుకున్నారట . ఆ డైరెక్టర్ మరెవరో కాదు సుకుమార్ . సుకుమార్ కాంబోలో బన్నీ హీరోగా తెరకెక్కిన సినిమా “పుష్ప”. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో లాస్ట్ వచ్చే ఫైట్ సీన్ లో కేవలం అండర్వేర్ లో కనిపిస్తారు బన్నీ-ఫహెద్ ఫసిల్.

ఈ సీన్ సినిమాకి హైలైట్ గా మారింది . అయితే నిజానికి పుష్ప సినిమాలో మొదటిగా హీరోగా అనుకున్నింది సుకుమార్ మహేష్ బాబుని అంటూ తెలుస్తుంది. ఒకవేళ మహేష్ బాబు ఈ సినిమాని యాక్సెప్ట్ చేసి ఉంటే ఆ అండర్వేర్ వేసుకున్న లుక్ లో కనిపించి ఉండేవాడు. అయితే ఈ సీన్ వివరించక ముందే మహేష్ బాబు ఈ సినిమా రిజెక్ట్ చేశారట . ఇంత మాస్ కంటెంట్ తన బాడీకి సూట్ అవ్వదు అంటూ మహేష్ సున్నితంగానే ఈ పాత్రను రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఈ పాత్ర చాలామంది హీరోస్ చుట్టూ తిరిగి ఫైనల్లీ బన్నీ వద్దకు వచ్చి చేరింది . ఈ సినిమాలో నటించినందుకుగాను 69 ఏళ్లుగా తెలుగు అభిమానులు ఎదురుచూసిన ఉత్తమ నటుడు జాతియ అవార్డు బన్నీ ని వరించింది..!!