ఫ్యాన్స్ అవునన్నా కాదన్నా.. ఆ విషయంలో తారక్ – బన్నీ తర్వాతే రామ్ చరణ్.. !

ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరు అంటే అందరికీ గుర్తొచ్చే పేర్లు రామ్ చరణ్ – ఎన్టీఆర్ – బన్నీ . అఫ్కోర్స్ రెబెల్ స్టార్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తున్న ఈ మధ్యకాలంలో సరైన హిట్ కొట్టలేదు . అందుకే క్రేజ్ పరంగా ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నా కానీ .. టాప్ హీరో లిస్టులోకి రాలేకపోతున్నారు . అయితే చరణ్ – తారక్ – ఎన్టీఆర్ మాత్రం ఆ విషయంలో నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్నారు . అయితే ముగ్గురికి ముగ్గురే అందరూ 100 కోట్లు తీసుకుంటున్నారు.. నటన పరంగా కూడా అవార్డులు కూడా సమాంతరంగా పంచుకుంటున్నారు.

అయితే ఎక్కువగా డైరెక్టర్ లు ఎన్టీఆర్ తో బన్నీతో సినిమా తీయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చరణ్ తో సినిమా తీయ్యడానికి చాలా తక్కువ మంది మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .హాలీవుడ్ డైరెక్టర్లు కూడా తారక్ సినిమా చేయాలని ఉంది అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు . ఇక పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ లు.. బాలీవుడ్ డైరెక్టర్ లు బన్నీ కోసం వెయిట్ చేస్తున్నాము అంటూ ఓపెన్ గానే చెప్పుకు వచ్చారు.

అయితే చరణ్ కి క్రేజ్ ఉన్న అవార్డులు అందుకుంటున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇంకా నార్మల్ స్థాయిలో ఉండే డైరెక్టర్ లే ఆయనతో సినిమా తీయడానికి ఇష్టపడుతున్నారని ..పాన్ ఇండియా డైరెక్టర్ లు.. హాలీవుడ్ డైరెక్టర్స్ ఆయన నటనకు ఇంప్రెస్ కాలేకపోతున్నారని.. అందుకే అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అలా చూసుకుంటే అవార్డులు అందుకున్న సరే ఎన్టీఆర్ – బన్నీ ఆ విషయంలో టాప్ అంటున్నారు ఫ్యాన్స్..!!