బాబుకు సపోర్ట్..మోసం లేదట?

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు జాతీయ స్థాయిలో మద్ధతు బాగానే వస్తుంది. కానీ ఆయన పొత్తు కోసం ఎదురుచూసిన బి‌జే‌పి నుంచి కాకుండా..ఇండియా కూటమి నేతల నుంచి మద్ధతు ఎక్కువ వస్తుంది. ఇప్పటికే బాబు అరెస్ట్‌ని మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్ ఖండించిన విషయం తెలిసిందే. ఇదంతా బి‌జే‌పి, వారి మిత్రులు చేస్తున్న కుట్ర అని చెప్పుకొచ్చారు. అంటే బి‌జే‌పితో వైసీపీ రహస్య మిత్రులుగా ఉన్నారనే వాదన తీసుకొస్తున్నారు.

చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలుకు పంపడం వల్ల ఆయనకే మేలు జరుగుతుందని, తక్షణమే ఏపీ ప్రభుత్వం ఈ చర్యలని ఉపసంహరించుకోవాలని జమ్మూకాశ్మీర్ మాజీ సి‌ఎం, ఎన్‌సి అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పిని బూటకపు ఆరోపణలతో అరెస్ట్ చేయడం క్రూరమైన చర్య అని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ అన్నారు. కక్షసాధింపు చర్యంలో భాగంగానే చంద్రబాబుని అరెస్ట్ చేశారని కర్నాటక మాజీ సి‌ఎం కుమారస్వామి చెప్పుకొచ్చారు.

అటు తెలంగాణలో పలువురు బి‌జే‌పి, బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నేతలు సైతం బాబు అరెస్ట్‌ని తప్పుబడుతున్నారు.  మొత్తానికి బాబుకు మద్ధతు బాగానే వస్తుంది. ఇదే సమయంలో ఈ స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో టి‌డి‌పి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న డిజైన్‌టెక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వికాస్‌ ఖన్వేల్కర్‌ సైతం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ క్లీన్‌ ప్రాజెక్టు అని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో మోసం లేదు, దగా లేదని ‘మీకు ప్రభుత్వం ఇన్ని కోట్లు ఇచ్చింది. దానిని ఎలా, ఎక్కడ ఖర్చు పెట్టారు?’ అని అడిగితే మేం బదులిస్తాం. కానీ… ఒక తప్పుడు నివేదికతో మాపై ఆరోపణలు చేస్తున్నారని, ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక, సీఐడీ రిపోర్ట్‌ రెండూ తప్పే అని, ఈ ప్రాజెక్టు కోసం పెట్టిన ఖర్చు, ప్రొడక్ట్‌ అండ్‌ సర్వీస్‌లకు సంబంధించి మా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని,  ఎవరైనా పరిశీలించుకోవచ్చని అన్నారు. మొత్తానికి ఈ బాబు అరెస్ట్ పై జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీలక అంశాలు బయటకొస్తున్నాయి.