‘ మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి ‘ లేడీస్ కోసం స్పెషల్ షో.. ఉచితం..!!

ఇటీవల అనుష్క శెట్టి నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన సినిమా మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజై మొదటి రోజే మంచి రెస్పాన్స్ సాధించింది. పి.మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందిన‌న ఈ సినిమా సెప్టెంబర్ 7న జవాన్ సినిమాకు పోటీగా రిలీజ్ అయింది. ప్రస్తుతం స్టడీగా కలెక్షన్లను రాబడుతూ ఈ సినిమా మంచి ఫామ్‌లో ఉంది. ఈసినిమాకి ప్ర‌భాస్‌, రానా, రామ్ చరణ్ లాంటి ప‌లు టాప్ స్టార్స్‌ ప్రమోషన్ చేయడంతో సినిమాపై మరింత హైప్‌ పెరిగింది.

ప్రేక్షకుఅ ఆదరణ పొందిన ఈ సినిమా 5 రోజుల్లో రూ.28 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. రూ.14.6 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం వరుస కలెక్షన్లను రాబడుతుంది. అయితే ఈ సినిమాను ఆడియన్స్ కు మరింత చేరువ చేసేందుకు మూవీ టీం ప్రయత్నిస్తున్నారు. తన సినిమాలు ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సినిమా ప్రియులకు, ఇండస్ట్రీ సెలబ్రిటీస్‌కి ధన్యవాదాలు చెబుతూ అనుష్క ఇటీవల వీడియో రిలీజ్ చేసింది.

ఈ గురువారం ఏపీ తెలంగాణలో మహిళల కోసం మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి స్పెషల్ షో ఫ్రీగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆడియన్స్ నుంచి వచ్చే మెసేజెస్, ట్విట్స్, ప్రేమ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందని వివరించింది అనుష్క. ఇక ఈ సినిమాలో నవీన్ కామెడీ అనుష్క ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పైగా చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సినిమా తో అనుష్క వెండితెరపై కనిపించింది.. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.