అంత మంది తెలుగు బ్యూటీస్ ఉంటే..దేవర కి బాలీవుడ్ ఫిగర్ నే ఎందుకు పెట్టారో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది తెలుగు హీరోయిన్లు ఉన్నారు . తెలుగు అనర్గళంగా మాట్లాడి చక్కటి ఫిజిక్ తో మంచి రూపంతో .. మంచి నటనా క్వాలిటీస్ తో కూడా మెప్పించే అందాల ముద్దుగుమ్మలు ఉన్నారు . అయితే ఎందుకో తెలియదు మన డైరెక్టర్లకి తెలుగు ముఖాల కన్నా బాలీవుడ్ ఫేసెస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కేవలం బాలీవుడ్ అనే కాదు మాలీవుడ్ -కోలీవుడ్ – కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా అందాల ముద్దుగుమ్మలనే తెలుగు ఇండస్ట్రీలోకి దింపుతూ ఉంటారు . పక్కాగా చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు అమ్మాయిలకి తప్పిస్తే మిగతా అందరికీ అవకాశాలు వస్తున్నాయి . రీజన్ ఏంటో ఇప్పటికే తెలియదు .

అయితే రీసెంట్గా దేవర సినిమాలో ఎందుకు జాన్వి కపూర్ ని చూస్ చేసుకున్నారు అన్న అంశం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ ..మంచి క్రేజ్ దక్కించుకుంది ..అయితే హిట్టు మాత్రం కొట్టలేకపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ కొట్టడానికి దేవర సినిమా ద్వారా దెబ్యూ ఇస్తుంది . తెలుగులో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు . ఎన్టీఆర్ కి తగ్గ రేంజ్ లోనే ఉండే స్టార్ బ్యూటీస్ ఉన్నారు .

కానీ కొరటాల శివ ఎందుకు దేవర సినిమాకు జాన్వి చూస్ చేసుకున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ ప్రకారం దేవర సినిమాలో దేవిక పాత్రలో ఫ్రెష్ ఫేస్ కనిపించాలి అని అప్పుడే సినిమాకి కొత్త అర్థం తీసుకొచ్చినట్లు ఉంటుందని ..అది కాకుండా కళ్ళల్లో అమాయకత్వం ఉట్టిపడేలా ఉన్న హీరోయిన్ అయితే ఈ పాత్రకు బాగా సూట్ అవుతుందని అందుకే జాన్విని చూస్ చేసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . చూద్దాం మరి జాన్వి ఈ సినిమాతో ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటుందో..?