ఎట్టకేలకు సలార్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!

డైరెక్టర్ ప్రశాంత్ నిల్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంతినిల్ తెరకెక్కించిన గత చిత్రాలు కేజిఎఫ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లేవల్లో ఈ నెల 28న ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించారు.కానీ అనుకోకుండా ఒక్కసారిగా వాయిదా పడడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేయకపోవడం చిత్ర బృందం ఈ విషయం పైన స్పందించకపోవడంతో గత కొద్దిరోజులుగా సలార్ సినిమా వాయిదా పడిందని వార్తలు వినిపించాయి.

Salaar Part 1 - Ceasefire: Teaser Of Prabhas Starrer Clocks 100 Million+ Views, Makers Officially Announce The Month Of Trailer Release

అయితే సలార్ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు ఇంకా పూర్తి కాలేదని సిజి వరకు కూడా పూర్తి కాలేదని అందుకే ఈ సినిమా వాయిదా పడిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చిన్న సినిమాల హవా ఈనెల 28వ తేదీన ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సలార్ సినిమా రిలీజ్ డేట్ పైన ప్రభాస్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈరోజు ఉదయం సలార్ సినిమా వాయిదా పైన చిత్ర బృందం స్పందించడం జరిగింది.

అధికారిక ట్విట్టర్ అకౌంట్లో సలార్ సినిమా వాయిదా పైన ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఈ పోస్టులో సలార్ సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు కొన్ని అనివార్య కారణాలవల్ల సలార్ సినిమా ఈ నెల 28న రిలీజ్ కావట్లేదు.. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాము అంటూ మీకు మరింత మంచి సినిమా టాక్ అనుభవం అందించడానికి మా వంతు కష్టపడుతున్నామంటూ త్వరలోనే సలార్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామంటూ ప్రకటించారు చిత్రబృందం.అందుకు సంబంధించిన ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.