దేవర సినిమాపై అదిరిపోయే అప్డేట్.. మరో యంగ్ హీరో ఎంట్రీ..

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా కావడం అలాగే కొరటాల శివ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుంది. ఇక ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. హైదరాబాద్ సమీపంలో వేసిన స్పెషల్ సెట్స్ లో ఎన్టీఆర్ సోలో సీన్స్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఈ షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఇతర యాక్టర్లతో కూడా ఈ సీన్లో షూటింగ్ చేయబోతున్నారట. వి ఎఫ్ ఎక్స్ కారణంగా సినిమా ఆలస్యం అవుతుందేమోనని ఆలోచనతో కొరటాల ముందుగానే సినిమా క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో ఒక పాత్ర చాలా స్పెషల్ గా ఉండబోతుందని ఆ పాత్రను రహస్యంగా ఉంచడానికి మూవీ టీం ప్రయత్నిస్తున్నారట. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆ పాత్రను నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఇంకా దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక షూటింగ్ దశలోనే ప్రేక్షకులలో భారీ హైప్‌ సొంతం చేసుకున్న‌ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.