నేనింతే సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

రవితేజ నటించిన ఎన్నో చిత్రాలలో చాలామంది హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. అలా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన నేనింతే సినిమా కూడా ఒకటి. ఇందులో హీరోయిన్ గా నటించింది శియా గౌతమ్. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడల్ గా తన చిని కెరీర్ని ప్రారంభించి.. ఆ తరువాత 2008లో రవితేజ నటించిన నేనింతే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్ పరంగా సక్సెస్ కాలేకపోయినా ప్రశంసలు అవార్డు సైతం అందుకున్నది.

Actress Siya Gautham Cute Speech at Pakka Commercial Movie Trailer Launch |  Gopichand ,Rashi Khanna - YouTube

నేనింతే సినిమా తర్వాత శియా గౌతమ్ కి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆ తరువాత వేదం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. కన్నడలో కొన్ని సినిమాలలో నటించిన సక్సెస్ కాలేక పోయింది. ఆ వెంటనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్ల తరువాత సినీ ఇండస్ట్రీకి దూరమయింది.. ఆ తర్వాత తన పేరుని అదితి గౌతమ్ గా మార్చుకుంది.. అయితే ఇటీవల గోపిచంద్ నటించిన పక్కా కమర్షియల్ అనే సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది శియా గౌతమ్.

Aditi Gautam,Siya Gautam Latest Photoshoot 📷 Video - YouTube

సినిమాలు చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ..శియా గౌతమ్ తాజాగా తెలుగులో అతిథి అనే వెబ్ సిరీస్లో నటించినట్లు తెలుస్తోంది.. ఒకప్పుడు కామెడీ సినిమాలతో మంచి పాపులారిటీ అందుకున్న తొట్టెంపూడి వేణు ఇందులో హీరోగా నటించారు.. వేణు సరసన అతిథి హీరోయిన్గా నటించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ విడుదలయ్యి అందరిని భయపెట్టిన ఆతిది వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ తో సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమ్మింగ్ కాబోతోంది.