బాబు కేసులో మలుపులు..సీన్ రివర్స్.!

చంద్రబాబు కేసుల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బాబుకు అనుకూలంగా ఎలాంటి తీర్పులు రావడం లేదు. దీంతో టి‌డి‌పి శ్రేణులు నిరాశలో ఉన్నాయి. ఇప్పటికే ఆయన కోసం టి‌డి‌పి శ్రేణులు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. కానీ అనుకున్న విధంగా మాత్రం పోరాటం ఫలించడం లేదు. అటు కోర్టుల్లో బాబుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే హైకోర్టులో బాబు క్వాష్ పిటిషన్ కొట్టేశారు. అటు సి‌ఐ‌డి కస్టడీలో 2 రోజుల పాటు విచారించి..మళ్ళీ అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగించారు.

ఇక ఏసీబీ కోర్టులో ఆయన బెయిల్ పై వాదనలు జరగనున్నాయి. అదే సమయంలో మళ్ళీ సి‌ఐ‌డి కస్టడీకి కోరనుంది ఈ రెండు పిటిషన్లపై విచారణ జరగనుంది. అయితే యథావిధిగానే బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురి కావచ్చు అని టి‌డి‌పి శ్రేణులు భావిస్తున్నాయి. అటు సి‌ఐ‌డి కస్టడీకి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇదంతా వైసీపీ కుట్రలో భాగంగానే జరుగుతుందని టి‌డి‌పి ఆరోపిస్తుంది.

ఇదిలా ఉంటే సుప్రీం కోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటీషన్‌పై ఏమి జరుగుతుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చంద్రబాబుపై ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులలో పిటీ వారెంట్‌లపై కూడా విచారించాలని ఏసీబీ కోర్టుని సీఐడీ కోరింది. అయితే రెండు రోజుల పాటు సి‌ఐ‌డి విచారణ చేయగా, అందులో బాబు.. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు ద్వారా తనకు డబ్బులు ముట్టాయని చేస్తున్న ఆరోపణలకు కనీస సాక్ష్యాలు చూపించాలని అడిగినట్లు తెలిసింది.

మొత్తానికి బాబు కేసులు కీలక మలుపులు తిరుగుతున్నాయి. మరి ఏసీబీ కోర్టులో బెయిల్ వస్తుందా? సుప్రీం కోర్టులో ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.