ఎన్ని వాడినా చుట్టూరాలడం ఆగట్లేదా అయితే మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇదే..

హెయిర్ పాల్ అనేది చాలామందిలో సాధారణంగా వినిపించే సమస్య. కొంతమందికి హెయిర్ ఫాల్ చాలా తీవ్రంగా ఉంటుంది. దీంతో హెయిర్ ఫాల్ సమస్యను నివారించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోతూ ఉంటారు. ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాలను కూడా ప్రయత్నిస్తారు. కానీ ఏ ప్రయత్నం చేసిన జుట్టు రాలడం మాత్రం ఆగదు. అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని ఫాలో అయితే చాలా వరకు జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా మిక్సీజార్ తీసుకొని అందులో ఒక కప్పు కరివేపాకు ఒక కప్పు మెంతాకు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్న ఆ మిశ్రమంలో రెండు స్పూన్ల ఉసిరికాయ పొడి ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలిపి మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ పూస్ట్‌ను జుట్టుకుదుళ‌ నుంచి చివరి వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించి ఉంచాలి. ఒక గంట సేపు దానిని అలాగే ఉంచిన తర్వాత ఏదైనా మైల్డ్‌ షాంపుతో తలను శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

వారానికి కేవలం ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ ఫాల్ తీవ్రత తగ్గుతుంది. క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. కరివేపాకు, మెంతాకు, ఉసిరి పొడి మరియు పెరుగులో ఉండే ఎన్నో సుగుణాలు జుట్టు కూదళ్లకు చక్కని పోషణ అందించే లక్షణాలను కలిగి ఉంటాయి. హెయిర్ ఫాల్ సమస్యకు అడ్డుకట్ట వేస్తాయి. కాబట్టి జుట్టు అధికంగా రాలుతున్న వారు ఈ హోమ్ రెమెడీని కచ్చితంగా పాటించండి. ఈ రెమిడీతో జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.