మహేష్ సినిమా వదులుకున్నందుకు ఇప్పటికీ ఫీల్ అవుతున్న.. నటి కామెంట్స్ వైరల్.. !

స్టార్ హీరో రాఘవ లారెన్స్ – బాలీవుడ్ బ్యూటీ కంగనా రనోత్ కాంబినేషన్లో ఇటీవల ” చంద్రముఖి 2 ” సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. పీ .వాసు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ తాజాగా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ క్రమంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటు సందడి చేస్తున్నారు మూవీ టీం. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా కంగానా ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంది.

 

ఇందులో భాగంగా కంగానా మాట్లాడుతూ మహేష్ బాబుతో వదులుకున్న సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేసింది. మహేష్ బాబు పోకిరి సినిమా ఎంత పెద్ద బాక్సాఫీస్ హిట్గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాల్లో ఇలియానా కంటే ముందు కంగనానే హీరోయిన్ అనుకున్నారట. కానీ ఈ మూవీని కంగనా రిజెక్ట్ చేసింది. దానికి కారణమేంటో తాజాగా వివరించింది. ఆమె మాట్లాడుతూ దర్శకుడు పూరి జగన్నాథ్ ఎప్పుడో నాలోని యాక్టర్ ను గుర్తించాడు.

నేను నటిని కాకముందే నేను ఎప్పటికైనా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతానని ఆయన చెప్పాడు. ఈ క్ర‌మంలోనే ” పోకిరి ” సినిమాతో ఆయన నన్ను టాలీవుడ్‌కి పరిచయం చేద్దామని భావించాడు. అదే టైంలో నాకు బాలీవుడ్ లో గ్యాంగ్స్టర్ సినిమాలో అవకాశం దక్కింది. ఇక రెండు సినిమాలు షూటింగ్ ఒకే సమయంలో ఉండడంతో నేను హిందీ మూవీనే ఎంచుకున్న. తర్వాత పూరీ జగన్నాథ్ నన్ను ఏక్ నిరంజన్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. కానీ పోకిరి సినిమా వదులుకున్నందుకు ఇప్పటికీ నేను ఫీల్ అవుతూనే ఉంటా అంటూ వివరించింది.