దేవర సినిమా కోసం కొరటాల శివ అదిరిపోయే ప్లాన్.. కర్ణాటక లోనే స్పెషల్ గా..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం దేవర.. ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండడం జరిగింది ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు సైతం ఈ సినిమా కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని అండర్ వాటర్ యాక్షన్స్ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Devara (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం నెలల తరబడి సెట్టింగ్స్ వేస్తూ సముద్ర గర్భంలో జరిగే యాక్షన్స్ సన్నివేశాలను వేస్తూ అచ్చం సముద్రాన్ని తలపించేలా సరికొత్త పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్ కోసం చాలా మంది ఫైటర్లు సైతం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరగబోతున్నట్లు సమాచారం. అక్కడ కొన్ని సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

 

ఇంతవరకు చూడని సరికొత్త లుక్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారని మత్స్యకార గ్రామం చుట్టూ తిరిగే కథ అంశముగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా బీచ్ సేట్ రూపొందిస్తున్నారు. తీర ప్రాంతాన్ని తలపించేలా ఇందులోని తీసుకొని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. టన్నుల కొద్ది ఇసుకని కర్ణాటకలోని కొన్ని టాప్ బీచ్ లో ఇసుకని అలాగే కొన్ని బండరాలను కూడా వివిధ ప్రాంతాల నుంచి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కడి నుంచి ప్రత్యేకమైన వాటిని ఇలా దేవర సినిమా కోసం ఉపయోగిస్తున్నారు.