టీడీపీ-జనసేనలో సీట్ల కోసం వైసీపీ నేతల పోటీ?

టీడీపీ-జనసేనల్లో సీట్లు దక్కించుకోవడం కోసం వైసీపీ నేతలు పోటీ పడుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది..దానికి ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి మంచి సమాధానమే ఇచ్చారు. వైసీపీలో పోటీ ఎక్కువైంది..సీట్లు దక్కించుకోవాలని చాలామంది చూస్తున్నారు. గెలిచే పార్టీ కాబట్టి..ఒకో సీటులో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే అందరికీ సీటు ఇవ్వలేము కాబట్టి..ఒకరికి సీటు ఇచ్చి..మిగిలిన వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చెబుతున్నామని, సీటు కోసం పట్టుబట్టే వారు..ఏ పార్టీ అయితే ఏముందితో సీటు కావాలని..వేరే పార్టీల్లోకి వెళుతున్నారని చెప్పుకొచ్చారు.

ఇటీవల గన్నవరం సీటు విషయంలో పంచాయితీ నడిచిన విషయం తెలిసిందే. అక్కడ టి‌డి‌పి నుంచి వచ్చిన వల్లభనేని వంశీకి సీటు ఫిక్స్ చేశారు..దీంతో వైసీపీలో ఉన్న యార్లగడ్డ..టి‌డి‌పిలోకి వస్తున్నారు. అంటే వైసీపీలో సీట్లు దొరక్క టి‌డి‌పిలోకి వెళుతున్నారు. అది కూడా బలం లేని నేతలే వెళుతున్నారని చెబుతున్నారు. ఇదే క్రమంలో ఇంకా వైసీపీలో చాలామంది నేతలు సీట్లు దక్కకపోతే పార్టీ మారిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలువురు నేతలు సీట్లు ఆశిస్తున్నారు. ఒకే సీటు కోసం ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. ఇక సీటు దక్కని వారు జనసేనలోకి జంప్ అవ్వడానికి చూస్తున్నారట. ఈ లిస్టులో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారనే చర్చ ఉంది.

అటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా సీట్లు పంచాయితీ నడుస్తోంది. ఈ క్రమంలో సీట్లు దక్కని వారు..టి‌డి‌పిలోకి వెళ్లాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇలా వైసీపీలో సీట్లు దక్కని వారే టి‌డి‌పి, జనసేనల్లోకి వెళ్లాలని చూస్తున్నట్లు తెలిసింది.