సౌత్ స్టార్ బ్యూటీ సమంత రీసెంట్ గా తన తల్లితో కలిసి ఆమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ లో మన భారతీయులు నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్ లో ఆమె పాల్గొంది. ర్యాలీలో సమంత చాలా హుషారుగా కనిపించింది. ప్రస్తుతం న్యూయార్క్ అందాలను ఆశ్వాదిస్తూ.. అక్కడి ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.
అలాగే అమెరికా ప్రయాణం మొదలైనప్పటి నుండి వరుసగా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా సమంత పంచుకుంటోంది. ఇకపోతే ఆమెరికా వెళ్లినా కూడా సమంత జిమ్ మాత్రం ఆపట్లేదు. అక్కడ కూడా వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తోంది. తాజాగా జిమ్ లో కష్టపడుతున్న ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర దిగిన ఫొటో, ఫ్రెండ్స్ తో కలిసి లంచ్ చేస్తున్న ఫోటో ఇలా మరికొన్ని ఫోటోలు కూడా ఆమె పంచుకుంది.
అయితే జిమ్ ఫోటోలో ఓ మిస్టరీ వ్యక్తితో సమంత కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఫోటోలో సదరు వ్యక్తి వెనక్కి తిరిగి ఉన్నాడు. ఫేస్ మాత్రం కనిపించలేదు. దీంతో ఆ మిస్టర్ మ్యాన్ ఎవరు అంటూ సమంతను ప్రశ్నిస్తున్నారు. కాగా, సమంత నుండి మరో పది రోజుల్లో ఖుషి మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
View this post on Instagram