ప్రేయ‌సి మెడ‌లో మూడు ముళ్లు వేసిన స్టార్ హీరో…!

పెళ్లి పీటలెక్కిన కోలీవుడ్ యంగ్ హీరో కెవిన్. ఇటీవల దాదా సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో త‌న ల‌వ‌ర్‌ మౌనిక డేవిడ్ మెడలో మూడు ముళ్ళువేసి వైవాహిక జీవితంలోనికి అడుగు పెట్టాడు. ఆదివారం ఉదయం ఇరు కుటుంబాల సమక్షంలో అత్యంత సన్నిహితుల తో కలిసి వీళ్ళ పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. నయనతార భర్త.. డైరెక్టర్ విగ్నేష్ శివన్‌ తదితర స్టార్ సెలబ్రిటీస్ ఈ పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను బ్లెస్స్ చేసినట్లు తెలుస్తోంది. తన వైఫ్‌తో మ్యారేజ్ ఈవెంట్లో కలిసి దిగిన ఫొటోస్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు యాక్టర్ కెవిన్.

ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవి చూసి అభిమానులు మీ జంట చూడముచ్చటగా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న కెవిన్ క‌నా కాన‌మ్ కల‌లాంగ‌ల్‌ సీరియల్ తో మొదటిసారిగా బుల్లితెరకు పరిచయమయ్యాడు. మొదటి సీరియల్ తోనే బాగా పాపులాట్లు తెచ్చుకున్నాడు. శ్రావణం మీనాక్షి, తాయుమానవన్ వంటి సీరియల్స్ లో బుల్లితెర హీరోగా నటించిన కెవిన్.. 2017లో శ‌త్రియాన్‌ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యాడు. ఆ తర్వాత సంవత్సరమే నాట్పున‌ ఎన్ననాను తెరియుమా సినిమాతో హీరోగా మారాడు.

ఇక ఈ ఏడాది వచ్చిన దాదా సినిమాతో సూపర్ హిట్ అందుకుని పాపులర్ హీరోగా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్ బిగ్ బాస్ సీజన్ లో కూడా పాల్గొన్నాడు కెవిన్ ఆ టైంలో తోటి కంటిన్యూస్టెంట్ లాస్లీలో లవ్ ట్రాక్ నడిపాడు. కానీ వీళ్ళు ప్రేమించుకున్న కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు. కెవిన్ ప్రస్తుతం కొరియోగ్రాఫర్ సతీష్ తో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు యువ సంచలనం అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.