డైరెక్ట‌ర్ వ‌ద్దే వ‌ద్దంటోన్న హీరో… సినిమా ఆగిపోయింది…!

అతగాడో క్రేజీ హీరో. పెద్ద బ్లాక్ బస్టర్ చేతిలో ఉన్న తరువాత సినిమా మాత్రం ఇవ్వాళ, రేపు అంటూ సాగుతున్న సమయంలో ఆ తరువాత మరో సినిమాకు సైన్ చేశాడు. చేతిలో ఉన్న సినిమా పూర్తయిన తరువాత సెట్ మీదకు వెళ్లలేదు. ఏంటి రీసన్ అంటే డైరెక్టర్ ఫేస్ నచ్చలేదు అని రీసన్ వినిపిస్తుంది. తరువాత సినిమాకు ఓ కొత్త డైరెక్టర్ ని సెట్ చేశాడు. కథ విన్నాడు.. ఓకే అన్నాడు అంతా బాగానే ఉంది.

కానీ ఈ మధ్యనే ఎందుకో తేడా వచ్చింది. కదా ఓకే కానీ డైరెక్టర్ నాట్ ఓకే అంటున్నాడట ఆ హీరో. కానీ ఆ కథ ఆదర్శకుడిదే. డైరెక్టర్గా వద్దు అంటే కదా ఎందుకు ఇస్తాడు. అందుకే హీరోను ఒప్పించడానికి నిర్మాతలు కుస్తీ పడుతున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే దర్శకుడు ఎందుకు వద్దు అన్న దానికి హీరో దగ్గర ఆన్సర్ లేదని తెలుస్తుంది.

పోనీ పనితీరు నచ్చలేదా అనుకుంటానికి ఇంకా షూటింగ్‌ మొదలే పెట్టలేదు. ఆల్ ఇన్ వన్ టైప్ హీరో. అందువల్ల అన్నిట్లో ఇన్వ‌ల్వ్ అవుతాడ‌ని టాక్ ఉంది. పేజీ డైలాగులను 10 పేజీలు చేసేస్తాడని కూడా టాక్. అందువల్ల డైరెక్టర్ ఇలాంటి వాటికి అడ్డం పడి ఉంటాడు. అందుకే డైరెక్టర్ ను మార్చేయాలి అంటున్నాడేమో అని ఇండస్ట్రీ వ‌ర్గాల‌లో టాక్‌.