గన్నవరం పోరు షురూ..వంశీ వర్సెస్ యార్లగడ్డ.!

తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓడించాలనే కసితో ఉన్నది కేవలం ముగ్గురుపైనే..అందులో మొదట సి‌ఎం జగన్..నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌ని అధికారంలోకి రాకుండా చేయాలనేది ప్రథమ లక్ష్యం..ఇక తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీలని ఓడించాలని కసితో ఉన్నారు. వీరిద్దరిపైనే టి‌డి‌పి శ్రేణులు ఎందుకు ఆగ్రహంతో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరు చంద్రబాబు, లోకేష్‌లని ఎలా తిడతారో చెప్పాల్సిన పని లేదు. పైగా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి తిడతారు.

అందుకే ఎలాగైనా వీరిని ఓడించాలని టి‌డి‌పి శ్రేణులు చూస్తున్నాయి. అయితే గుడివాడలో కొడాలికి చెక్ పెట్టడం అనేది ఈజీ కాదు..పైగా అక్కడ రావి వెంకటేశ్వరరావు నిలబడతారా? లేదా వెనిగండ్ల రాము నిలబడతారా? అనేది క్లారిటీ లేదు. సరే గుడివాడ విషయం పక్కన పెడితే..గన్నవరం..గత ఎన్నికల వరకు ఇది టి‌డి‌పి కంచుకోట. 2019 ఎన్నికల్లో వంశీ టి‌డి‌పి నుంచి గెలిచి, వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అప్పటినుంచే వంశీ..చంద్రబాబుని టార్గెట్ చేసి ఏ స్థాయిలో తిడతారో తెలిసిందే. అయితే వంశీ వైసీపీ వైపుకు వెళ్ళాక..టి‌డి‌పికి బచ్చుల అర్జునుడుని ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన అంతగా ఎఫెక్టివ్ గా పనిచేయలేదు. పైగా అనారోగ్యంతో ఆయన మరణించారు.

దీంతో గన్నవరం టి‌డి‌పి ఇంచార్జ్ ఎవరు లేరు..ఈ సీటు కోసం పలువురు టి‌డి‌పి నేతలు పోటీ పడుతున్నారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు..ఇప్పుడు టి‌డి‌పిలోకి వస్తున్నారు. ఇప్పటివరకు వైసీపీ సీటు ఇస్తుందని ఆశించారు..కానీ వంశీ వైపే మొగ్గు చూపడంతో యార్లగడ్డ..తాజాగా తన అనుచరులతో భేటీ అయ్యి..టి‌డి‌పిలోకి వచ్చేందుకు ఫిక్స్ అయ్యారు.

ఇక టి‌డి‌పి నుంచి యార్లగడ్డ బరిలో దిగితే..వంశీకి పోటీ ఇవ్వగలరా? అంటే ఇవ్వగలరనే చెప్పవచ్చు. ఆర్ధికంగా, సామాజికంగా వంశీతో ఢీ కొట్టగలరు. అటు టి‌డి‌పికి బలమైన కేడర్ ఉంది. కాకపోతే వంశీకి మాస్ ఫాలోయింగ్ ఉంది. దాన్ని దాటితే యార్లగడ్డ విజయం సాధించగలరు.