భ‌గ‌వంత్ కేస‌రి ముందు టైగ‌ర్ నిలుస్తుందా…. వెన‌క‌డుగు వేస్తుందా…!

ఈ దసరాకు పోటాపోటీగా బాలయ్య భగవంత్‌ కేసరి , ర‌వితేజా టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో హిట్లని తన ఖాతాలో వేసుకుంటున్న బాలయ్య భగవంత్‌ కేసరి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా 19 అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అక్టోబర్ లోనే ఒక రోజు తేడాతో మాస్ మహారాజు రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల కాబోతుంది. నూతన దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించింది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం రవితేజ ఫ్లాప్ లైన్లో ఉన్నాడు.

అలాగే ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు ఈ రెండు విషయాల్లో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కాస్త సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక బాలయ్య భగవంత్ కేసరి ముందు రవితేజ టైగర్ నాగేశ్వరరావు గట్టి పోటీ ఇవ్వగలదో లేదా వెన‌క‌డుగు వేస్తుందో చూడాలి.