అవార్డుల సినిమా తీసి రిలీజ్ చేయ‌లేక ఆస్ప‌త్రి పాలైన నిర్మాత‌…!

సినిమా అనేది బడ్జెట్ తో కూడిన బిజినెస్. ఇంట్ర‌స్ట్ కొద్ది ఇండస్ట్రీలోకి వచ్చామని చెప్పినా చివరికి వ్యాపారం ఒకటి నిలబడుతుంది అనడంలో సందేహం లేదు. అలా ఇప్పుడు ఒక అవార్డు సినిమా తీసి సినీ ప్రోడ్యూస‌ర్ ఆసుపత్రి పాలైనట్లు సమాచారం. విషయం ఏంటంటే ఆజాదీక అమృత మహోత్సవ పిలుపుతో ప్రేరణ పొంది.. స్వాతంత్రం కోసం చిన్న వయసులో ప్రాణాన్ని త్యాగం చేసిన ఓ గొప్ప వ్యక్తిపై సినిమా తీసిన నిర్మాత సినిమాను విడుదల చేయలేక ఆర్థిక భారాన్ని భరించలేని స్థితిలో గుండెపోటుకు గురయ్యాడట‌.

స్వేచ్ఛ, స్వతంత్రాల కోసం చిన్న వయసులోనే ప్రాణాని ఆగం చేసిన వ్యక్తి ఖుదిరామ్‌ బోస్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ పాన్ ఇండియా లెవెల్ మూవీ ని గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ జాగర్లమూడి నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందించిన ఈ సినిమాను ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో టెలికాస్ట్ చేయగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక 2022 డిసెంబర్ 22న ఈ సినిమాను మన దేశ వ్యాప్తిత పార్లమెంట్ సభ్యులు కూడా వీక్షించారు. అలా సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న‌ ఈ సినిమా రిలీజ్ కు మాత్రం నోచుకోలేకపోయింది.

కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన సినిమాలు విడుదల చేయలేక ఆర్థిక సమస్యలు ఒత్తిడితో నిర్మాత గుండెపోటుకు గురయ్యాడట. చిత్ర పరిశ్రమంలో ఎంతో పేరు ప్రఖ్యాత సంపాదించిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేశారని తెలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా మణిశర్మ, ప్రొడక్షన్ డిజైనర్ గా నేషనల్ అవార్డు విన్నర్ తోటాతరిని, స్టంట్ డైరెక్టర్ గా కనల్ కన్నన్‌, సినిమాటోగ్రాఫర్ గా రసూల్ ఎల్లోర్, ఎడిటర్ గా మార్తాన్ కే వెంకటేష్ ఈ ప్రాజెక్టులో పని చేశారట. ఖుదిరామ్‌ బోస్ గురించి ఈ జనరేషన్ కు తెలియకపోవడం మరియు కమర్షియల్ సినిమాల మధ్య ఇలాంటి బయోపిక్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లేకపోవడం నిర్మాత ఈ దుస్థితికి రావడానికి కారణం అంటూ తెలుస్తుంది.