టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి కొడుకులుగా వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఒకప్పుడు చిరంజీవి క్రేజ్ ఎలా ఉండేదో చెప్పాల్సిన పనిలేదు..అగ్ర హీరోగా పేరు పొందిన చిరంజీవి ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.. 10 సంవత్సరాలా పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి పరవాలేదు అనిపించుకున్న ఆ తర్వాత వరుసగా ఐదు సినిమాలు చేస్తే అందులో రూ .200 కోట్ల రూపాయలు సాధించిన సినిమాలు ఉండగా మూడు డిజాస్టర్ గా మిగిలాయి..
ఆచార్య, రీసెంట్గా భోళా శంకర్ సినిమాలు ఫ్లాప్ గానే మిగిలాయి. భోళా శంకర్ విషయంలో చిరంజీవి ఘోరమైన అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పవచ్చు. చిరంజీవికి కచ్చితంగా ఇప్పుడు ఒక సక్సెస్ కావాలని అభిమానులు భావిస్తూ ఉన్నారు. అందుకే చిరంజీవి తన తదుపరి సినిమా ఏంటి అనే విషయంపై అభిమానులు ఆరా తీయగా కొంతమంది డైరెక్టర్ వశిష్ట తో అని చెబుతూ ఉండగా మరి కొంతమంది డైరెక్టర్ మురుగదాసుతో ఒక సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఈ రెండు కాకపోతే డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.అయితే ఇందులో రామ్ చరణ్ కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఈనెల 22వ తేదీన రాబోతున్నట్లు సమాచారం. మరి తండ్రి కొడుకులు గా పేరుపొందిన రాంచరణ్ చిరంజీవి ఈసారి బిగ్గెస్ట్ మల్టీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి మరి..