ఊర‌మాస్‌తో ఊపేస్తోన్న శ్రీలీల‌… వీడియో చూస్తారా…!

రామ్ హీరోగా క్రేజీ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న మూవీ స్కంద‌. బోయపాటి శ్రీను, శ్రీనివాస్ చిట్టూరి దర్శక నిర్మాతలుగా పాన్ ఇండియా లెవెల్ లో నవంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా శుక్రవారం ‘ గంధారబాయి ‘ లిరిక్ తో ఊర మాస్ పాటని రిలీజ్ చేసింది మూవీ టీం.

థ‌మన్ సంగీతం అందించిన ఈ పాట నకాష్ అజీజ్, సౌజన్య భాగవతుల పాడారు. డాన్స్ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ వ్యవహరించాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా థ‌మ‌న్‌ స్వరూ కల్పన అందించిన ఈ పాటకు కూడా బాగా ఆదరణ లభించింది.

‘ గంధారబాయి ‘ ఊర మాస్ సాంగ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పాటలో రామ్, శ్రీ లీల వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బోయపాటి స్టైల్ లో ఈ కథ రాబోతుంది. నవంబర్ 15 నుంచి థియేటర్లలో మాస్ హంగామా మొదలవుతుందని నిర్మాతలు పేర్కోన్నారు.