నాచురల్ స్టార్ నాని ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎంతో కష్టపడిన తరువాత స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో.. అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించిన నాని తర్వాత హీరోగా మారాడు చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని ఇటీవల తాజాగా దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
అలాంటి నాని సినీ ఇండస్ట్రీలో ఇద్దరు సూపర్ స్టార్ తో నటించే అవకాశాన్ని పక్కన పెట్టాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రజనీకాంత్, అమితాబచ్చన్ తో కలిసి సినిమాల్లో నటించే అవకాశాన్ని నాని రిజెక్ట్ చేశాడట. ఈ సినిమాల్లో నటుడు నానికి ఓ ప్రముఖ పాత్రను డైరెక్టర్ ఆఫర్ చేయగా నాని అందుకు ఒప్పుకోలేదు. అదే రజినీకాంత్ 179వ సినిమా. ఈ సినిమాకి టీజే జ్ఞానవేలు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్.. తో పాటు అమితాబచ్చన్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నటి మంజు వారియర్ కూడా కీరోల్‌లో నటించబోతుంది.

అదే సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం నాచురల్ స్టార్ నానిని దర్శకుడు కోరగా అతడు నిరాకరించాడట.
ఇది నాని అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నానికి వచ్చిన పాత్ర నెగిటివ్ పాత్ర కావడంతో నాని ఆ పాత్రను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు నెగిటివ్ షెడ్‌లో ఉన్న పాత్రలను నటించలేదు నాని. వి సినిమాలో కాస్త నెగిటివ్ షెడ్ లో నటించిన ఆ సినిమాకి అతనే హీరోగా కూడా ఉన్నాడు. అయితే ఇకపై నెగటివ్ రాల్‌లో నటించకూడదని నాని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పాత్రకు నటుడు శర్వానంద్ సెలెక్ట్ చేసుకున్నారట.