టీడీపీ-జనసేన నెక్స్ట్ ఉగాదికి ఉండవా?

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామనే కాన్ఫిడెన్స్ లో వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. ఈ సారి 175కి 175 సీట్లు గెలిచేస్తామని చెబుతున్నారు. ఇంకా ప్రతిపక్షాలు అడ్రెస్ ఉండవని మాట్లాడుతున్నారు. జగన్ ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టే..మళ్ళీ ప్రజలు జగన్‌కు అండగా నిలబడతారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఓ అడుగు ముందుకేసి..వచ్చే ఉగాదికి టి‌డి‌పి-జనసేనలు ఉండవని, ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని చెప్పుకొచ్చారు.

ఒకరు 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనే వ్యక్తి, మరొకరు అవగాహన లేని చేతలు మాటల సెలబ్రెటీ అంటూ బాబు, పవన్ పై ఫైర్ అయ్యారు.  అన్న పార్టీ మూసేసిన తరువాత తమ్ముడు దుకాణం తెరిచారని, జనసేన తన రాజకీయ దుకాణం తెరిచి పదిహేనేళ్లు అయ్యిందని, వారి రాజకీయాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం, రాజకీయాలంటేనే అసహ్యం వేస్తోందని ఫైర్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే మట్టి కొట్టుకుపోతారని, రాజకీయ అనుభవంతో చెబుతున్నా ప్రజల మంచి చెయాలనే తపన బాబు-పవన్‌కు లేదని బొత్స వ్యాఖ్యానించారు.

మొత్తానికి ఉగాది నాటికి ఎన్నికలు జరుగుతాయని, అప్పుడు టి‌డి‌పి, జనసేనలు చిత్తుగా ఓడిపోయి అడ్రెస్ లేకుందా పోతాయనే ఉద్దేశంతో బొత్స మాట్లాడినట్లు కనబడుతోంది. అయితే రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి గాని, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు..ఒకవేళ ప్రతిపక్షాలు ఓడిపోయి..మళ్ళీ జగన్ అధికారంలోకి రావచ్చు. కానీ సంస్థాగతంగా క్షేత్ర స్థాయిలో పాతుకుపోయిన టి‌డి‌పి అడ్రెస్ లేకుందా పోవడం కాస్త కష్టమే. అటు జనసేన కూడా బలోపేతం అవుతుంది.

మరి ఇలాంటి పరిస్తితుల్లో టి‌డి‌పి-జనసేన కలిస్తే రాజకీయాలు కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ సారి ఏ పార్టీకి ప్రజల మద్ధతు ఉంటుందో.